ఘరానా మోసగాడు అవినాష్ అనుచరుడు సుబ్రహ్మణ్యంపై మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
విజయవాడ: ఘరానా మోసగాడు అవినాష్ అనుచరుడు సుబ్రహ్మణ్యంపై మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అంతర్జాతీయ మానవహక్కుల కమిటీలో పదవి ఇప్పిస్తామంటూ.. రూ. 3లక్షలను సుబ్రహ్మణ్యం తీసుకుని మోసం చేసాడంటూ బీజేపీ నేత గురునాథ్ ఆరోపించారు.
డబ్బు తిరిగి ఇవ్వమంటే తనపై సుబ్రహ్మణ్యం బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ గురునాథ్ పోలీసులను అశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు సుబ్రహ్మణ్యంపై కేసు నమోదు చేసినట్టు మాచవరం పోలీసులు తెలిపారు.