
క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ పరాజయం
స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ‘హ్యాట్రిక్’ టైటిల్‌ను సాధించడంలో భారత క్రీడాకారులు విఫలమయ్యారు.
బాసెల్: స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ‘హ్యాట్రిక్’ టైటిల్‌ను సాధించడంలో భారత క్రీడాకారులు విఫలమయ్యారు. 2015లో శ్రీకాంత్, 2016లో హెచ్‌ఎస్ ప్రణయ్ ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో విజేతలుగా నిలిచారు. ఈ ఏడాది డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ప్రణయ్ పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. ప్రణయ్ 19–21, 11–21తో షి యూచి (చైనా) చేతిలో ఓడిపోయాడు.