హైదరాబాద్‌ ఓటమి | Premier Badminton League: Delhi Dashers Beat Hyderabad Hunters | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ ఓటమి

Jan 10 2019 12:32 AM | Updated on Jan 10 2019 12:32 AM

 Premier Badminton League: Delhi Dashers Beat Hyderabad Hunters - Sakshi

బెంగళూరు: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ హంటర్స్‌కు 3–4తో ఢిల్లీ డాషర్స్‌ చేతిలో ఓటమి ఎదురైంది. పురుషుల సింగిల్స్‌ తొలి మ్యాచ్‌లో ప్రణయ్‌ (ఢిల్లీ) 15–10, 9–15, 15–12తో రాహుల్‌ యాదవ్‌పై గెలుపొందగా, డాషర్స్‌ ‘ట్రంప్‌’ అయిన పురుషుల డబుల్స్‌లో చయ్‌ బియావో–జొంగ్జిత్‌ ద్వయం 8–15, 15–9, 15–8తో అరుణ్‌–ఇసారా (హైదరాబాద్‌) జంటపై నెగ్గింది. దీంతో ఢిల్లీ 3–0తో  ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

తర్వాత మహిళల సింగిల్స్‌ను హంటర్స్‌ ‘ట్రంప్‌’ మ్యాచ్‌గా ఎంచుకోగా సింధు 15–11, 15–9తో కొసెట్స్‌కయా (ఢిల్లీ)పై విజయం సాధించింది. రెండో పురుషుల సింగిల్స్‌లో సుగియార్తో (ఢిల్లీ) 15–6, 15–11తో గాల్జౌను ఓడించడంతో 4–2తో డాషర్స్‌ విజయం ఖాయమైంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కిమ్‌ స రంగ్‌–ఇయోమ్‌ (హైదరాబాద్‌) జంట 15–7, 15–12తో వాంగ్‌ సిజి– చియా సిన్‌ లీ జోడీపై గెలిచింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో అవధ్‌ వారియర్స్‌ 5–0తో నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌పై జయభేరి మోగించింది. 25 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరు రాప్టర్స్‌తో చెన్నై స్మాషర్స్‌ ఆడుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement