న్యూఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో హైదరాబాద్ హంటర్స్ జట్టు వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. ఢిల్లీ డాషర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్ 0–5తో ఓటమి పాలైంది. పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో ఇవనోవ్–సొజోనోవ్ (ఢిల్లీ) జంట 15–9, 15–11తో మార్కిస్ కిడో–యో యోన్ సెయోంగ్ జోడీని ఓడించింది. హైదరాబాద్ హంటర్స్ పురుషుల సింగిల్స్ ‘ట్రంప్’ మ్యాచ్‌లో లీ హున్ ఇల్ 15–13, 11–15, 4–15తో విన్సెంట్ (ఢిల్లీ) చేతిలో పరాజయం పొందాడు. మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో కరోలినా మారిన్ 15–10, 15–12తో సుంగ్ జీ హున్ (ఢిల్లీ)పై గెలుపొందింది. ఢిల్లీ డాషర్స్ పురుషుల సింగిల్స్ ‘ట్రంప్’ మ్యాచ్‌లో తియాన్ హువీ 15–14, 14–15, 15–10తో సాయిప్రణీత్ (హంటర్స్)పై నెగ్గాడు. మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో సాత్విక్–పియా జెబాదియా (హంటర్స్) జంట 11–15, 12–15తో ఇవనోవ్–అశ్విని పొన్నప్ప (ఢిల్లీ) జోడీ చేతిలో ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment