
పుణే: రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు పరాజయాల పరంపర కొనసాగింది. ఈ సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శన కనబర్చిన జట్టు వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. గురువారం మూడో రోజే ముగిసిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో మహారాష్ట్ర 9 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను చిత్తు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 176/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 192 పరుగులకే ఆలౌటైంది. మహారాష్ట్రకు 193 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
దాంతో ఆ జట్టు హైదరాబాద్‌ను ‘ఫాలో ఆన్’ ఆడించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్ వైఫల్యంతో హైదరాబాద్ 219 పరుగులకే కుప్పకూలింది. చందన్ సహాని (59) అర్ధ సెంచరీ సాధించగా...తన్మయ్ అగర్వాల్ (43), రోహిత్ రాయుడు (37) కొన్ని పరుగులు జోడించారు. 27 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాష్ట్ర 17 బంతుల్లో వికెట్ నష్టానికి 30 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించింది.
Comments
Please login to add a commentAdd a comment