అమృత ఇంట్లోకి అపరిచిత వ్యక్తి.. | Unknown Person Enter Into Amrutha Home | Sakshi
Sakshi News home page

అమృత ఇంట్లోకి అపరిచిత వ్యక్తి..

Published Tue, Sep 24 2019 6:48 PM | Last Updated on Tue, Sep 24 2019 7:35 PM

Unknown Person Enter Into Amrutha Home - Sakshi

సాక్షి, నల్లగొండ : మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్‌ భార్య అమృత ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి వచ్చాడు. ఎవరూ లేని సమయంలో అమృత ఇంట్లోకి ప్రవేశించి ఓ పోస్ట్‌ కవర్‌ను పెట్టి వెళ్లాడు. ఆ లేఖను తెరచి చూడగా అందులో ఓ వ్యక్తి కలర్‌ ఫోటో, తన శరీర కొలతల వివరాలు ఉన్నాయి. అతని పుట్టిన తేది, ఫోన్‌ నెంబర్‌, ఇతర వివరాలు లేఖలో రాసి ఉన్నాయి. సీసీ కెమెరా పుటేజీలో ఆగంతకుడు గేటు తీసి లోపలికి వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి ఈ లేఖను ఇంట్లో పెట్టి వెళ్లాడు. అయితే ఎందుకు ఆ వ్యక్తి లేఖను పెట్టి వెళ్లాడు? ఆ వ్యక్తి ఎవరు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా 2018 సెప్టెంబర్‌ 14న ప్రణయ్‌ హత్యకు గురైన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement