
ప్రణయ్, జారాఖాన్
ప్రణయ్, జారాఖాన్ జంటగా శివనాగేశ్వరరావు (శివాజీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘జాబిలమ్మ’. కె. హరిరత్నం నిర్మిస్తున్నారు. చిత్రకథానాయకుడు ప్రణయ్ పుట్టినరోజును గురువారం సంస్థ కార్యాలయంలో జరిపారు. శివాజీ మాట్లాడుతూ– ‘‘జాబిలమ్మ’ సినిమాని దాదాపు 15రోజులు మురికివాడలో చిత్రీకరించాం. మంచి నటన కనబరిచారు ప్రణయ్. ఇందులోని 5 మెలోడి పాటలకు ఎంఎల్ రాజు చక్కని సంగీతం అందించారు’’ అన్నారు. ‘‘115మందికి ఆడిషన్స్ చేయగా ప్రణయ్ హీరోగా ఎంపికయ్యాడు. దీపావళికి టీజర్ విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు హరిరత్నం. ‘‘నా పాత్ర మాస్, క్లాస్‌కు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు ప్రణయ్.