
సాక్షి, మిర్యాలగూడ టౌన్: తన కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకుందనే ఉద్దేశంతో మారుతీరావు పట్టణంలోని ముత్తిరెడ్డికుంటకు చెందిన పేరుమళ్ల ప్రణయ్‌ను ఇస్లాంపురలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద హత్య చేయించాడు. ఈ కేసులో ఎ–1 ప్రధాన నిందితుడిగా ఉన్న తిరునగరు మారుతీరావు శనివారం రాత్రి ఖైరతాబాద్‌లో గల ఆర్య సమాజ భవనంలో మృతి చెందడంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆదివారం మిర్యాలగూడలోని పేరుమళ్ల ప్రణయ్ నివాసం వద్ద పోలీస్ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. టూ టౌన్ సీఐ శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఏఎస్‌ఐ గౌసు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
ఇప్పటికే ప్రణయ్ కుటుంబానికి 8 మంది గన్‌మెన్‌లను ఏర్పాటు చేయగా మారుతీరావు చనిపోవడంతో మరి కొంతమంది పోలీస్‌లను ఏర్పాటు చేశారు. అదే విధంగా ప్రణయ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావు మృతదేహం పట్టణంలోని రెడ్డికాలనీలో గల నివాసానికి వస్తుండటంతో అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. మారుతీరావు మృతదేహానికి కాసేపట్లో అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలకు పట్టణవాసులు, బంధువులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. (‘అమృతా.. అమ్మ దగ్గరకు వెళ్లు’)
Comments
Please login to add a commentAdd a comment