ఓలా యాప్‌లో ‘ట్యాక్సీఫర్‌స్యూర్’ బుకింగ్ | App ola in the 'taxi for sure' booking | Sakshi
Sakshi News home page

ఓలా యాప్‌లో ‘ట్యాక్సీఫర్‌స్యూర్’ బుకింగ్

Published Fri, Jun 26 2015 12:22 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 AM

ఓలా యాప్‌లో  ‘ట్యాక్సీఫర్‌స్యూర్’ బుకింగ్

ఓలా యాప్‌లో ‘ట్యాక్సీఫర్‌స్యూర్’ బుకింగ్

ముంబై : ఇక నుంచి ఓలా యాప్ ద్వారా ట్యాక్సీఫర్‌స్యూర్‌కు చెందిన హ్యాచ్‌బ్యాక్ క్యాబ్స్‌ను కూడా బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సదుపాయం ముంబై, ఢిల్లీ ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉంది. ఓలా యాప్‌లో కనిపించే టీఎఫ్‌ఎస్ ఆప్షన్ ద్వారా వినియోగదారులు రూ.49 ప్రారంభ ధరతో ట్యాక్సీఫర్‌స్యూర్ క్యాబ్స్‌ను బుకింగ్ చేసుకోవచ్చని ఓలా సీఓఓ ప్రణయ్ తెలిపారు. ట్యాక్సీఫర్‌స్యూర్ వాహనాలను ఓలా యాప్‌కు అనుసంధానం చేయడం వల్ల తమ వినియోగదారులకు మరిన్ని వాహనాలకు అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు.

ఈ ఏడాది మార్చిలో 200 మిలియన్ డాలర్లు (రూ.1,260 కోట్లు) వెచ్చించి ట్యాక్సీఫర్‌స్యూర్‌ను ఓలా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ట్యాక్సీఫర్‌స్యూర్‌కు దేశవ్యాప్తంగా 24,000 వాహనాలు ఉన్నాయి. వీటిలో సగభాగం హ్యాచ్‌బ్యాక్స్‌దే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement