ola app
-
‘ఓలా మా డేటా కాపీ చేసింది’
స్వదేశీ డిజిటల్ మ్యాపింగ్ సేవల సంస్థ మ్యాప్ మై ఇండియా తన డేటాను ఓలా ఎలక్ట్రిక్ కాపీ చేసిందని ఆరోపించింది. ఓలా మ్యాప్స్‌లో సంస్థ తయారుచేసిన మ్యాప్ డేటాను వాడుతున్నట్లు మ్యాప్ మై ఇండియా చెప్పింది. గతంలో ఇరు కంపెనీలు చేసుకున్న ఒప్పందాన్ని ఓలా ఎలక్ట్రిక్ ఉల్లంఘించిందని తెలియజేస్తూ కోర్టును ఆశ్రయించింది.ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లో మ్యాపింగ్ సేవలందించేందుకు రెండు కంపెనీలు గతంలో ఒప్పందం చేసుకున్నాయి. అయితే మ్యాప్ మై ఇండియా మాతృ సంస్థ సీఈ ఇన్ఫో సిస్టమ్స్ ద్వారా ‘కో-మింగ్లింగ్’, రివర్స్ ఇంజినీరింగ్, ఏపీఐ(అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్), ఎస్డీకే(సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్)లోని కీలక మ్యాప్ డేటా వివరాలను ఒప్పందానికి విరుద్ధంగా ఓలా కంపెనీ కాపీ చేసినట్లు ఆరోపణల్లో తెలిపింది. ఓలా ఒప్పంద నియమాలను ఉల్లంఘించినందుకు కోర్టులో దావా వేసినట్లు మ్యాప్ మై ఇండియా పేర్కొంది. ఈమేరకు మ్యాప్ మై ఇండియా సీఈ ఇన్ఫో సిస్టమ్స్ ద్వారా ఓలాకు నోటీసులు పంపించింది.ఈ వ్యవహారంపై ఓలా స్పందిస్తూ..మ్యాప్ మై ఇండియా చేసిన ఆరోపణనలను తీవ్రంగా ఖండించింది. సీఈ ఇన్ఫో సిస్టమ్స్ చేసిన వాదనలను తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు దురుద్దేశపూరితమైనవని, తప్పుదోవ పట్టించేవని తెలిపింది. ఓలా ఎలక్ట్రిక్ వ్యాపార పద్ధతుల సమగ్రతకు కట్టుబడి ఉందని పేర్కొంది. మ్యాప్ మై ఇండియా పంపిన నోటీసుకు త్వరలో తగిన విధంగా స్పందిస్తామని చెప్పింది.ఇదీ చదవండి: రూ.1,799కే 4జీ ఫోన్!ఇదిలాఉండగా, జులై మొదటివారంలో ఓలా ప్లాట్‌పామ్‌లో గూగుల్ మ్యాప్స్‌ను వినియోగించబోమని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక సొంత లొకేషన్ ఇంటెలిజెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. గూగుల్ మ్యాప్స్‌తో ఒప్పందం రద్దు చేసుకోవడం వల్ల కంపెనీకి ఏటా రూ.100 కోట్లు ఆదా అవుతాయని పేర్కొంది. గ్లోబల్ మ్యాపింగ్ లీడర్ గూగుల్ భారతదేశంలోని కస్టమర్ల కోసం గూగుల్ మ్యాప్స్ ధరలను 70 శాతం తగ్గించడం గమనార్హం. -
ఈ యాప్ యూజర్లకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఫ్రీ
బెంగళూరు: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి భారత ప్రజలు ఈ వైరస్ దెబ్బకు అల్లాడిపోతున్నారు. ఆరోగ్యపరంగానే ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పలువురు సెలబ్రిటీలు, సంస్థలు, అంతేందుకు సామాన్యులు సైతం తమకు తోచిన విధంగా కరోనా బాధితులకు సాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రైడింగ్ యాప్ ఓలా ఔదార్యం చాటుకుంది. తమ యూజర్ల ముంగిటకు ఆక్సిజన్కాన్సన్ట్రేటర్లను ఉచితంగా అందించాలని నిర్ణయించుకుంది. మా యూజర్లకు ఫ్రీగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు ప్రతీ రోజు పెరగడం, అందులో ఎక్కువ మంది ఆక్సిజన్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. కొందరికి సకాలంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కూడా విడిచారు. దీంతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకు డిమాండ్ పెరిగింది. ఈ కారణంగా ఓలా సంస్థ తమ యూజర్లకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఉచితంగా అందించడానికి ముందుకువచ్చింది. ఇందుకు చేయాల్సిందల్లా అవసరమైన వారి కనీస వివరాలు ఓలా యాప్‌లో నింపాల్సి ఉంటుంది. తరువాత అవసరమైన వారి ఇంటి ముందుకే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఉచితంగా తీసుకునేలా ఓలా ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమాన్ని గివ్ ఇండియాతో భాగస్వామ్యం ద్వారా ఓలా ఫౌండేషన్ చేయనుంది. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకు, వాటి రవాణా చార్జీల కింద ఓలా తమ యూజర్ల నుంచి ఎలాంటి మొత్తం వసూలు చేయదు. ప్రారంభంగా 500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఈ వారం నుంచి బెంగళూరు నగరంలో ప్రారంభించనుంది. రాబోయే వారాల్లో 10,000 వరకు దేశవ్యాప్తంగా వీటి సరఫరా జరిగేలా అమలు చేస్తామని ఓలా సహ వ్యవస్ధాపకులు భవీష్ అగర్వాల్ వెల్లడించారు. అసాధారణ పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేసేందుకు తాము ఓ2ఫర్ఇండియా కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన ప్రకటించారు. ( చదవండి: మద్యం ప్రియులకు శుభవార్త.. ఇకపై హోం డెలివరీ ) -
ఓలా యాప్ ద్వారా ట్యాక్సీఫర్‌ష్యూర్ క్యాబ్ బుకింగ్
హైదరాబాద్: ఓలా యాప్ ద్వారా హైదరాబాద్‌లోని వినియోగదారులు ట్యాక్సీఫర్‌ష్యూర్(టిఎఫ్ఎస్) హ్యాచ్‌బాక్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ సౌకర్యాన్ని ఢిలీ, ముంబై, బెంగళూరుల్లో ఆఫర్ చేస్తున్నామని ఓలా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ శుక్రవారం నుంచి హైదరాబాద్‌సహా మరో 26 నగరాల్లో ఈ సౌకర్యాన్ని విని యోగించుకోవచ్చని ఓలా సీఓఓ ప్రణయ్ జివ్రాజ్క పేర్కొన్నారు. ఓలా యాప్‌లో టీఎఫ్ఎస్ ఐకాన్‌పై క్లిక్ చేయడం ద్వారా ట్యాక్సీఫర్‌ష్యూర్ హ్యాచ్‌బాక్‌ను బుక్ చేసుకోవచ్చని వివరించారు. చార్జీలు రూ.49 నుంచి ప్రారంభమవుతాయి. -
ఓలా యాప్‌లో ‘ట్యాక్సీఫర్‌స్యూర్’ బుకింగ్
ముంబై : ఇక నుంచి ఓలా యాప్ ద్వారా ట్యాక్సీఫర్స్యూర్కు చెందిన హ్యాచ్‌బ్యాక్ క్యాబ్స్‌ను కూడా బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సదుపాయం ముంబై, ఢిల్లీ ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉంది. ఓలా యాప్‌లో కనిపించే టీఎఫ్ఎస్ ఆప్షన్ ద్వారా వినియోగదారులు రూ.49 ప్రారంభ ధరతో ట్యాక్సీఫర్‌స్యూర్ క్యాబ్స్‌ను బుకింగ్ చేసుకోవచ్చని ఓలా సీఓఓ ప్రణయ్ తెలిపారు. ట్యాక్సీఫర్‌స్యూర్ వాహనాలను ఓలా యాప్‌కు అనుసంధానం చేయడం వల్ల తమ వినియోగదారులకు మరిన్ని వాహనాలకు అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో 200 మిలియన్ డాలర్లు (రూ.1,260 కోట్లు) వెచ్చించి ట్యాక్సీఫర్స్యూర్ను ఓలా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ట్యాక్సీఫర్స్యూర్కు దేశవ్యాప్తంగా 24,000 వాహనాలు ఉన్నాయి. వీటిలో సగభాగం హ్యాచ్బ్యాక్స్దే.