అమృత, మారుతిరావుపై సినిమా.. ఫస్ట్‌లుక్‌ | Ram Gopal Varma Release First Look Of a Maruthi Rao And Amrutha Movie | Sakshi
Sakshi News home page

అమృత, మారుతిరావుపై సినిమా.. ఫస్ట్‌లుక్‌

Published Sun, Jun 21 2020 5:16 PM | Last Updated on Sun, Jun 21 2020 5:30 PM

Ram Gopal Varma Release First Look Of a Maruthi Rao And Amrutha Movie - Sakshi

ప్రేమ వివాహం చేసుకున్న పెరుమాళ్ల ప్రణయ్ హత్యకు గురికావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రణయ్‌ భార్య అమృత తండ్రి మారుతిరావు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయితే ఇటీవల హైదరాబాద్‌లోని ఓ హోటల్‌ గదిలో మారుతి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. అయితే వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కించే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. అమృత, మారుతిరావుల కథ ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు.

నేడు ఫాదర్స్‌‌ డే సందర్భంగా ఈ విషాదగాథకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్ట్‌ర్‌ను విడుదల చేశారు. ‘ఓ తండ్రి అమితమైన ప్రేమ.. ఓ తండ్రి తన కుమార్తె అమితంగా వల్ల కలిగే ప్రమాదం.. అమృత, మారుతిరావుల కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంగా హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. ఫాదర్‌ డే రోజున.. ఈ విషాద తండ్రి కథకు సంబంధించిన చిత్రం పోస్టర్‌ను లాంచ్‌ చేస్తున్నాను’ అని వర్మ పేర్కొన్నారు. ఈ చిత్రానికి మర్డర్‌ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు.. కుటుంబ కథా చిత్రం అనే ట్యాగ్‌ లైన్‌ ఉంచారు. రామ్‌గోపాల్‌ వర్మ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి నట్టి కరుణ, నట్టి కరుణ క్రాంతి నిర్మాతలుగా ఉండగా.. ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇక, మారుతి రావు పాత్రలో శ్రీకాంత్‌ అయ్యంగార్‌ నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement