సెమీస్‌లో సింధు, ప్రణయ్ | PV Sindhu enters semifinals of Macau Open | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సింధు, ప్రణయ్

Published Sat, Nov 29 2014 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM

సెమీస్‌లో సింధు, ప్రణయ్

సెమీస్‌లో సింధు, ప్రణయ్

స్థాయికి తగ్గట్టు ఆడుతున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధుతో పాటు పురుషుల విభాగంలో ప్రణయ్ కూడా మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు.

మకావు ఓపెన్ బ్యాడ్మింటన్

 మకావు: స్థాయికి తగ్గట్టు ఆడుతున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధుతో పాటు పురుషుల విభాగంలో ప్రణయ్ కూడా మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సింధు 21-17, 19-21, 21-16తో ఐదో సీడ్ హాన్ లీ (చైనా)పై గెలిచింది.

63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ సింధుకు ఆద్యంతం గట్టిపోటీ లభించింది. అయితే కీలకదశలో పాయింట్లు నెగ్గిన ఈ హైదరాబాద్ అమ్మాయి విజయాన్ని ఖాయం చేసుకుంది. శనివారం జరిగే సెమీఫైనల్లో ఎనిమిదో సీడ్ బుసానన్ ఒంగ్‌బుమ్‌రుంగ్‌పాన్ (థాయ్‌లాండ్)తో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్ 21-19, 21-17తో సోనీ ద్వి కున్‌కురో (ఇండోనేసియా)ను ఓడించి సెమీస్‌కు చేరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement