ప్రిక్వార్టర్స్‌లో సింధు, ప్రణయ్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పీవీ సింధు, హెచ్‌ఎస్ ప్రణయ్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆరో సీడ్ సింధు 21-9, 29-27తో రుుప్ పుయ్ రుున్ (హాంకాంగ్) పై గెలుపొందగా... పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రణయ్ 21-16, 21-18తో బున్‌సాక్ పొన్సానా (థాయ్‌లాండ్)ను ఓడించాడు. మరో మ్యాచ్‌లో అజయ్ జయరామ్ 22-20, 10-21, 18-21తో జిన్‌టింగ్ ఆంథోనీ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు.
రుుప్ పుయ్ రుున్‌తో 45 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సింధు రెండు గేముల్లోనూ తొలుత వెనుకబడి ఆ తర్వాత పుంజుకోవడం విశేషం. తొలి గేమ్‌లో 2-6తో వెనుకంజలో ఉన్న దశలో సింధు వరుసగా ఆరు పారుుంట్లు గెలిచి 8-6తో ముందంజ వేసింది. రుుప్ పుయ్ రుున్ ఒక పారుుంట్ సాధించిన తర్వాత సింధు మళ్లీ విజృంభించి ఈసారీ వరుసగా ఆరు పారుుంట్లు గెలిచి 14-7తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈసారీ రుుప్ పుయ్ రుున్ ఒక పారుుంట్ నెగ్గిన తర్వాత సింధు మళ్లీ చెలరేగి వరుసగా ఐదు పారుుంట్లు సాధించి 20-8తో ముందంజ వేసింది.
ఈ దశలో ఒక పారుుంట్ కోల్పోరుున సింధు ఆ వెంటనే మరో పారుుంట్ గెలిచి తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడటంతో ఆధిక్యం పలుమార్లు దోబూచులాడింది. రుుప్ పుయ్ రుున్ మూడుసార్లు గేమ్ పారుుంట్లను వదులుకోగా... ఏడో ప్రయత్నంలో సింధు గేమ్ పారుుంట్‌ను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో తియెన్ చున్ చూ (చైనీస్ తైపీ)తో ప్రణయ్; బింగ్‌జియావో (చైనా)తో సింధు తలపడతారు.