
సాక్షి, నల్గొండ : పరువుహత్యకు బలైన ప్రణయ్ భార్య అమృతను కించపరిచేలా అసభ్య కామెంట్లు చేసిన యువకున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆదివారం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈశ్వర్(25) అనే యువకుడు ప్రణయ్ హత్య విషయంలో ఫేస్‌బుక్ వేదికగా అమృత వర్షినిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు. దీంతో ఈశ్వర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.