ప్రణయ్ మరో అద్భుత విజయం | HS Prannoy, Kidambi Srikanth march into semis | Sakshi
Sakshi News home page

ప్రణయ్ మరో అద్భుత విజయం

Published Fri, Jun 16 2017 6:56 PM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM

ప్రణయ్ మరో అద్భుత విజయం

ప్రణయ్ మరో అద్భుత విజయం

జకర్తా: ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత ఆటగాడు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ మరో అద్బుత విజయాన్ని సాధించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 29వ ర్యాంకర్ ప్రణయ్ 21-18, 16-21, 21-19 తేడాతో ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్(చైనా)ను ఓడించి సెమీస్ లో కి ప్రవేశించాడు. గురువారం టాప్‌సీడ్‌ లీ చోంగ్‌ వీ (మలేసియా)పై సంచలన విజయం సాధించిన ప్రణయ్ మరొకసారి అద్వితీయ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

ఈ రోజు పోరులో తొలి గేమ్ ను కష్టపడి గెలిచిన ప్రణయ్.. రెండో గేమ్ లో పోరాడి ఓడాడు. ఆపై నిర్ణయాత్మక మూడో గేమ్ లో ప్రణయ్-చెన్ లాంగ్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. అయితే కీలకసమయంలో ఒత్తిడిని అధిగమించిన ప్రణయ్ విజయం సాధించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్నాడు.

మరొక పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ సైతం సెమీస్ కు చేరాడు. శ్రీకాంత్ 21-15, 21-14 తేడాతో జు వీ వాంగ్‌ (చైనీస్‌తైపీ)పై గెలిచి సెమీస్ కు చేరాడు. వరుస గేమ్లను చేజిక్కించుకున్న శ్రీకాంత్ ఎటువంటి తడబాటు లేకుండా సెమీస్ పోరుకు సిద్ధమయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement