Indonesia badminton tournament
-
లక్ష్య సేన్ ఓటమి.. అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో కూడా ఇంటికే
ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. జకార్తాలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్... మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ఓడిపోయారు. ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–15, 10–21, 13–21తో మూడో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. 62 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ తొలి గేమ్‌లో స్కోరు 15–15తో సమంగా ఉన్నపుడు వరుసగా ఆరు పాయింట్లు గెలిచి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే క్రిస్టీ పుంజుకొని వరుసగా రెండు గేముల్లో గెలిచి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో అశ్విని–తనీషా 13–21, 18–21తో యూకీ ఫకుషిమా–సయాక హిరోటా (జపాన్) చేతిలో ఓడిపోయారు. చదవండి: MS Dhoni: ఏ మాత్రం తగ్గని ధోని మేనియా T20 WC Ind Vs Eng: ఆసీస్‌పై ఇంగ్లండ్ విజయం.. ఫైనల్లో టీమిండియాతో పోరు! చరిత్రకు అడుగు దూరంలో భారత్. End of 🇮🇳's campaign. 📸: @badmintonphoto#IndonesiaMasters2023#Badminton pic.twitter.com/etm7svf1rQ — BAI Media (@BAI_Media) January 27, 2023 -
లక్ష్యసేన్‌కు నిరాశ
బాలి: ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రోజు భారత షట్లర్లకు ఏ మాత్రం కలిసిరాలేదు. పురుషుల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన లక్ష్యసేన్, పారుపల్లి కశ్యప్ తొలి రౌండ్లోనే ఓడి ఇంటిదారి పట్టారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21–23, 15–21తో ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో పోరాడి ఓడాడు. 54 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్ తొలి గేమ్‌ను చేజేతులా కోల్పోయాడు. ఇరు ఆటగాళ్ల మధ్య ఆధిక్యం పలుమార్లు మారిన తొలి గేమ్‌లో లక్ష్యసేన్ ఒక దశలో 18–14తో ఆధిక్యంలో ఉన్నాడు. కీలక సమయంలో మొమోటా చాంపియన్ ఆటతో వరుసగా ఆరు పాయింట్లు సాధించి 20–18తో ఆధిక్యంలోకి వచ్చాడు. వెంటనే తేరుకున్న లక్ష్యసేన్ వరుసగా మూడు పాయింట్లు సాధించి 21–20తో గేమ్ పాయింట్‌కు వెళ్లాడు. మరోసారి తన అనుభవాన్ని ఉపయోగించిన మొమోటా వరుసగా మూడు పాయింట్లు సాధించి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక రెండో గేమ్‌లో మరింత దూకుడు కనబర్చిన జపాన్ షట్లర్ మ్యాచ్‌ను ముగించేశాడు. మరో పోరులో కశ్యప్ 11–21, 14–21తో లోహ్ కీన్ య్యూ (సింగపూర్) చేతిలో వరుస సెట్లలో ఓడాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ధ్రువ్ కపిల–అర్జున్ ద్వయం 20–22, 13–21తో చోయ్ సొల్జ్యూ– కిమ్ వోన్హూ (కొరియా) జంట చేతిలో... మిక్స్డ్ డబుల్స్‌లో ప్రసాద్–జుహి దేవాంగన్ జోడీ 12–21, 4–21తో జన్సెన్– లిండా ఎఫ్లర్ (జర్మనీ) జంట చేతిలో ఓడాయి. -
ఒలింపిక్ ఛాంపియన్‌కు షాకిచ్చిన భారత షట్లర్
బాలీ: ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. టోర్నీ రెండో సీడ్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)పై అద్భుత విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 14–21, 21–19, 21–16తో విక్టర్ అక్సెల్సన్పై గెలుపొందాడు. 71 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయిన ప్రణయ్... రెండో గేమ్ నుంచి పుంజుకున్నాడు. అద్భుతమైన స్మాష్ షాట్లతో ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. రెండు, మూడు గేమ్‌ల్లో నెగ్గి విజయాన్ని అందుకున్నాడు. విక్టర్ అక్సెల్సన్పై ప్రణయ్‌కిదే తొలి విజయం. గతంలో అతడితో ఆడిన ఐదు సార్లు కూడా ప్రణయ్ ఓడిపోయాడు. మరో మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్ 13–21, 21–18, 21–15తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై నెగ్గగా... లక్ష్యసేన్ 13–21, 19–21తో ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓడాడు. మహిళల పిక్వ్రార్టర్స్‌లో పీవీ సింధు 17–21, 21–7, 21–12 క్లారా అజుర్మెండి (స్పెయిన్)పై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో ప్రపంచ ఐదో ర్యాంక్ జంటను ఓడించిన సిక్కి రెడ్డి–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం పోరాటం ప్రిక్వార్టర్స్‌లో ముగిసింది. సిక్కి రెడ్డి–ధ్రువ్ జంట 15–21, 23–21, 18–21తో జోమ్కో–సుపిసార (థాయ్‌లాండ్) జోడీ చేతిలో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–సిక్కి రెడ్డి (భారత్) జోడీ 18–21, 12–21తో కిటిట్‌హరకుల్–రవిండ ప్రజోంగ్జ (థాయలాండ్) జంట చేతిలో ఓడింది. -
సిక్కి రెడ్డి–ధ్రువ్ జంట సంచలనం
బాలి: ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సిక్కి రెడ్డి–ధ్రువ్ కపిల (భారత్) జంట సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 178వ ర్యాంక్‌లో ఉన్న సిక్కి రెడ్డి–ధ్రువ్ ద్వయం 21–11, 22–20తో ప్రపంచ 5వ ర్యాంక్, రెండో సీడ్ ప్రవీణ్ జోర్డాన్–మెలాతి దెవా ఒక్తావియాంతి (ఇండోనేసియా) జంటను బోల్తా కొట్టించింది. కేవలం 30 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండో గేమ్‌లో సిక్కి–ధ్రువ్ జోడీ 15–19తో వెనుకబడింది. అయితే ఒక్కసారిగా చెలరేగిన సిక్కి–ధ్రువ్ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 20–19తో ఆధిక్యంలోకి వచ్చారు. ఆ తర్వాత ఒక పాయింట్ కోల్పోయినా... వెంటనే రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సుమిత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) 15–21, 16–21తో హఫీజ్ ఫైజల్–గ్లోరియా (ఇండోనేసియా) జోడీ చేతిలో... వెంకట్ గౌరవ్ ప్రసాద్–జూహీ దేవాంగన్ (భారత్) 15–21, 12–21తో చాంగ్ తక్ చింగ్–ఎన్జీ వింగ్ యుంగ్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మాజీ వరల్డ్ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ 21–18, 15–21, 21–16తో క్రిస్టోవ్ పొపోవ్ (ఫ్రాన్స్)పై... హెచ్ఎస్ ప్రణయ్ 22–20, 21–19తో డారెన్ లియు (మలేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ పారుపల్లి కశ్యప్ 10–21, 19–21తో హాన్స్ క్రిస్టియన్ విటింగస్ (డెన్మార్క్) చేతిలో... ప్రపంచ 16వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21–16, 14–21, 20–22తో హిరెన్ రుస్తావితో (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయి తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. -
సింధు నిష్క్రమణ
జకర్తా: ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. స్టార్ షట్లర్ పీవీ సింధు గురువారం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఐదో సీడ్ సింధు 21–16, 16–21, 19–21తో సయాక తకహషి (జపాన్) చేతిలో భంగపడింది. తొలి గేమ్‌ను గెలుచుకున్న సింధు... అనంతరం మిగిలిన రెండు గేముల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతకు ముందే బుధవారం మిగిలిన భారత షట్లర్లు టోర్నీనుంచి నిష్క్రమించారు. తొలి రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్ 21–19, 13–21, 5–21తో సయాక తకహషి చేతిలో ఓడింది. కిడాంబి శ్రీకాంత్ 21–18, 12–21, 14–21తో హిరెన్ రుస్తావిటో (ఇండోనేసియా) చేతిలో, సాయి ప్రణీత్ 21–16, 18–21, 10–21తో షి యు కీ (చైనా) చేతిలో, సౌరభ్ వర్మ 21–17, 15–21, 10–21తో లు జుయాంగ్ జు (చైనా) చేతిలో, సమీర్ వర్మ 17–21, 21–19, 10–21తో టామీ సుగియార్తో (ఇండోనేసియా) చేతిలో, పారుపల్లి కశ్యప్ 14–21, 12–21తో ఆంథోని సినిసుక జింటింగ్ (ఇండోనేసియా) చేతిలో, హెచ్ఎస్ ప్రణయ్ 17–21, 14–21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి 20–22, 15–21 స్కోరుతో మొహమ్మద్ – హెండ్రా సెటియావన్ జోడీ (ఇండోనేసియా) చేతిలో ఓడగా... మిక్స్డ్ డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా– సిక్కి రెడ్డి జంట 8–21, 14–21తో కో సుంగ్ హ్యూన్– యోమ్ హే వోన్ ద్వయం (దక్షిణ కొరియా) చేతిలో పరాజయాన్ని చవిచూసింది. -
హెచ్ఎస్ ప్రణయ్ సంచలన విజయం
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ సంచలన విజయం సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రణయ్ 21-15, 9-21, 21-14 తేడాతో ఐదుసార్లు వరల్డ్ చాంపియన్ లిన్‌డాన్(చైనా)కు షాకిచ్చాడు. 59 నిమిషాల పోరులో ప్రణయ్ ఆద్యంత ఆకట్టుకుని తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించాడు. మొదటి గేమ్‌ను గెలిచిన ప్రణయ్.. రెండో గేమ్‌ను భారీ తేడాతో కోల్పోయాడు. ఆపై నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ప్రణయ్ సత్తాచాటి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇది లిన్డాప్పై ప్రణయ్‌కు రెండో విజయం. ఈ ఇద్దరూ ఇప్పటివరకూ మూడుసార్లు తలపడితే రెండు సందర్భాలో ప్రణయ్‌నే విజయం వరించింది. ప్రణయ్ రెండో రౌండ్లో వాంగ్ జు వియ్(చైనీస్ తైపీ)తో తలపడనున్నాడు. -
సూపర్ సైనా
జకర్తా: ఇండోనేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో మెరుగైన క్రీడాకారులను చిత్తుచేస్తూ దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ సైనా 21–19, 21–19తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)పై 48 నిమిషాల్లోనే విజయం సాధించింది. ఈ విజయంతో ముఖాముఖి రికార్డులో సైనా 9–5తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఫైనల్లో టాప్‌సీడ్, ప్రపంచ నం.1 క్రీడాకారిణి తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో అమీతుమీ తేల్చుకుంటుంది. ముఖాముఖి రికార్డులో తై జు యింగ్ 5–8తో ఆధిక్యంలో ఉంది. సాత్విక్ జోడి ఓటమి పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడీ పోరాటం సెమీస్‌లో ముగిసింది. సెమీఫైనల్లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 14–21, 11–21తో టాప్ సీడ్ మార్కస్ ఫెర్నాల్డి గిడెయోన్ – కెవిన్ సంజయ సుకముల్జో (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. -
ప్రణయ్ మరో అద్భుత విజయం
జకర్తా: ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ మరో అద్బుత విజయాన్ని సాధించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 29వ ర్యాంకర్ ప్రణయ్ 21-18, 16-21, 21-19 తేడాతో ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్(చైనా)ను ఓడించి సెమీస్ లో కి ప్రవేశించాడు. గురువారం టాప్‌సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా)పై సంచలన విజయం సాధించిన ప్రణయ్ మరొకసారి అద్వితీయ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ రోజు పోరులో తొలి గేమ్ ను కష్టపడి గెలిచిన ప్రణయ్.. రెండో గేమ్ లో పోరాడి ఓడాడు. ఆపై నిర్ణయాత్మక మూడో గేమ్ లో ప్రణయ్-చెన్ లాంగ్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. అయితే కీలకసమయంలో ఒత్తిడిని అధిగమించిన ప్రణయ్ విజయం సాధించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. మరొక పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ సైతం సెమీస్ కు చేరాడు. శ్రీకాంత్ 21-15, 21-14 తేడాతో జు వీ వాంగ్ (చైనీస్‌తైపీ)పై గెలిచి సెమీస్ కు చేరాడు. వరుస గేమ్‌లను చేజిక్కించుకున్న శ్రీకాంత్ ఎటువంటి తడబాటు లేకుండా సెమీస్ పోరుకు సిద్ధమయ్యాడు. -
ప్రణయ్ సంచలనం
∙ టాప్‌సీడ్ లీ చోంగ్‌పై నెగ్గిన భారత ప్లేయర్ ∙ క్వార్టర్స్‌లోకి ప్రవేశం ∙ శ్రీకాంత్ ఇన్.. సింధు, సైనాలకు షాక్ ∙ ఇండోనేసియా ఓపెన్ జకర్తా: ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ సంచనల ఆటతీరు ప్రదర్శించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 29వ ర్యాంకర్ ప్రణయ్ 21–10, 21–18తో ప్రపంచ మాజీ నం.1, టాప్‌సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా)పై వరుస గేమ్‌ల్లో గెలుపొందాడు. 40 నిమిషాలపాటు జరిగిన ఈ గేమ్‌లో భారత ప్లేయర్ ఆధిపత్యం కొనసాగింది. తొలిగేమ్ ఆరంభంలో 6–0తో శుభారంభం చేసిన ప్రణయ్.. క్రమంగా తన ఆధిపత్యాన్ని 10–3కి పెంచుకున్నాడు. అదేజోరులో ఏమాత్రం ఒత్తిడిలేకుండా ఆడుతూ ఆగేమ్ను తన సొంతం చేసుకున్నాడు. రెండోగేమ్‌లో తొలుత 10–6తో ఆధిక్యంలోకి వెళ్లిన ప్రణయ్‌కు కొంచెం ప్రతిఘటన ఎదురైంది. ఈ దశలో వరుసగా పాయింట్లు సాధించిన లీ చోంగ్.. 13–12తో ముందంజలో నిలిచాడు. అయితే ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్రమంగా పాయింట్లు సాధిస్తూ 17–14తో భారత ప్లేయర్ ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ దశలో వరుసగా మూడు పాయింట్లు సాధించిన లీ.. 17–17తో మ్యాచ్‌ను ఉత్కంఠదిశగా నడిపించాడు. అయితే ఈ స్థితిలో రెచ్చిపోయిన ప్రణయ్ వరుసగా మూడు పాయింట్లు సాధించి మ్యాచ్ ముంగింట నిలిచాడు. అయితే లీ పట్టుదలగా పోరాడి ఓ మ్యాచ్ పాయింట్‌ను కాచుకున్నాడు. అయితే ఈ దశలో దూకుడుగా ఆడిన ప్రణయ్ గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. తాజా విజయంతో లీతో ముఖాముఖిపోరును 1–2తో ప్రణయ్ మెరుగుపర్చుకున్నాడు. మరో ప్రిక్వార్టర్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21–15, 20–22, 21–16తో జాన్ జోర్గెన్సెన్ (డెన్మార్క్)పై పోరాడి విజయం సాధించాడు. 57 నిమిషాలపాటు జరిగిన ఈమ్యాచ్‌లో కీలకదశలో దూకుడుగా ఆడిన శ్రీకాంత్ గెలుపును కైవసం చేసుకున్నాడు. తొలిగేమ్‌లో ఇరువురు ధాటిగా ఆడడంతో స్కోర్లు చాలాసార్లు సమమయ్యాయి. స్కోరు 10–10తో సమంగా ఉన్న దశలో వరుసగా పాయింట్లు సాధిం చిన శ్రీ.. 16–12తో ముందంజ వేశాడు. ఈదశలో జోర్గెన్సన్ పుంజుకుని 15–17తో పోరాడాడు. అయితే ఈదశలో భారత ప్లేయర్ వరుసగా నాలుగుపాయింట్లు సాధించి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. రెండోగేమ్‌లోనూ ఇరువురు హోరాహోరీగా పోరాడడంతో స్కోర్లు చాలాసార్లు సమమయ్యాయి. కీలకదశలో చెలరేగిన జోర్గెన్సన్ ఆ గేమ్‌ను నెగ్గాడు.మూడోగేమ్ ఆరంభంలో 0–5తో వెనుకంజలో నిలిచిన శ్రీ.. క్రమంగా పాయింట్లు సాధించి 15–12తో ముందంజ వేశాడు. ఈ దశంలో ఇదే దూకుడును కొనసాగించిన భారత ప్లేయర్ గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. క్వార్టర్స్‌లో ప్రపంచ మాజీ నం.1, ఒలింపిక్ చాంపియన్, ఎనిమిదో సీడ్ చెన్ లాంగ్ (చైనా)తో ప్రణయ్, ప్రపంచ 19వ ర్యాంకర్, జు వీ వాంగ్ (చైనీస్‌తైపీ)తో శ్రీకాంత్ తలపడనున్నాడు. సైనా, సింధులు ఔట్ మరోవైపు మహిళల సింగిల్స్‌లో భారత అగ్రశ్రేణి ప్లేయర్, మూడుసార్లు చాంపియన్ సైనానెహ్వాల్‌కు షాక్ తగిలింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 15వ ర్యాంకర్, సైనా 15–21, 21–6, 16–21తో నిచ్చన్ జిందాపోల్ (థాయ్‌లాండ్) చేతిలో పోరాడి ఓడింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈమ్యాచ్‌లో కీలకదశలో తడబడిన సైనా మూల్యం చెల్లించుకుంది. తొలిగేమ్ ఆరంభం నుంచి వెనుకంజలో నిలిచిన సైనా.. ఆదే స్థితిలో ఆ గేమ్‌ను కోల్పోయింది. ఇక రెండోగేమ్‌లో రెచ్చిపోయిన సైనా.. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశమివ్వకుండా ఆగేమ్ను కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మూడోగేమ్‌లో 14–12తో ఆధిక్యంలో ఉన్న సైనా.. అనంతరం తడబడి వరుసగా పాయింట్లు సమర్పించుకుంది. దీంతో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కోల్పోయింది. మరోవైపు మరో భారత నం.1 షట్లర్ పీవీ సింధు కూడా పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో నాలుగోసీడ్ సింధు 21–15, 12–21, 18–21తో బీవెన్ జాంగ్ (అమెరికా)చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలిగేమ్ కైవసం చేసుకున్న భారత ప్లేయర్.. మిగతా రెండు గేమ్‌లలో తడబడి మూల్యం చెల్లించుకుంది.