► తొలి మ్యాచ్‌లో భారత్ 2-3తో థాయ్‌లాండ్ చేతిలో పరాజయం
► థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ
కున్‌షున్ (చైనా): అగ్రశ్రేణి సింగిల్స్ క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్ గైర్హాజరీలో... థామస్ కప్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఆదివారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 2-3 తేడాతో థాయ్‌లాండ్ చేతిలో ఓడిపోయింది. తొలి సింగిల్స్‌లో ప్రపంచ 21వ ర్యాంకర్ అజయ్ జయరామ్ 16-21, 21-12, 14-21తో ప్రపంచ 26వ ర్యాంకర్ తనోంగ్‌సక్ సేన్‌సోమ్‌బున్‌సుక్ చేతిలో ఓటమి పాలయ్యాడు.
రెండో మ్యాచ్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం 17-21, 6-21తో బొదిన్ ఇసారా-నిపిత్‌పోన్ జోడీ చేతిలో ఓడింది. మూడో మ్యాచ్‌లో సాయిప్రణీత్ 21-11, 21-16తో ఖొసిత్ పెట్‌ప్రాదబ్‌పై గెలిచి భారత్ ఖాతా తెరిచాడు. అయితే నాలుగో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్-అక్షయ్ దేవాల్కర్ జోడీ 15-21, 21-14, 15-21తో డెచాపోల్-కెద్రెన్ జంట చేతిలో పరాజయం పాలవ్వడంతో భారత్‌కు 1-3తో ఓటమి ఖాయమైంది. నామమాత్రమైన ఐదో మ్యాచ్‌లో సౌరభ్ వర్మ 21-17, 16-21, 21-19తో అదుల్చ్ ్రనమ్‌కుల్‌పై గెలుపొందాడు. మంగళవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో హాంకాంగ్‌తో భారత్ ఆడుతుంది.
ఓటమితో మొదలు
Published Mon, May 16 2016 1:07 AM | Last Updated on Mon, Sep 4 2017 12:10 AM
Advertisement
Advertisement