
మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్
నగరవాసులకు సరికొత్త మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్. గ్రామీ అవార్డు విన్నర్ అఫ్రోజాక్, బాలీవుడ్‌కు చెందిన ఫర్హా అక్తర్ సంగీత సాగరాన్ని పరవళ్లు తొక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 22నగచ్చిబౌలిలో జరిగే ‘సన్‌బర్న్ ఎరెనా’లో అఫ్రోజాక్ ప్రదర్శన ఇవ్వనున్నాడు.
అలాగే ఈ నెల 29, 30 తేదీల్లో జరిగే వైండ్‌సాంగ్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఫర్హన్ అక్తర్ షో ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ దస్‌పల్లా హోటల్‌లో ఆదివారం ఈ కార్యక్రమాల కర్టెన్‌రైజర్ జరిగింది. హీరో రానా, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా ఈవెంట్ లోగోలు ఆవిష్కరించారు.
సాక్షి, సిటీప్లస్