క్రియేటివ్ మైండ్స్
రుద్రమదేవి... గుణశేఖర్ దర్శకత్వంలోని మోస్ట్ అవెయింటింగ్ మూవీ. రుద్రమదేవిగా అనుష్క, చాళుక్య వీరభద్రుడిగా రానా ఫస్ట్ లుక్‌లోనే అభిమానుల మనసు దోచేసుకున్నారు. అందాల యువరాణిగా అనుష్కకు అంతటి దర్పాన్ని, అచ్చమైన రాజకుమారుడిగా రానాకి రాజఠీవిని తెచ్చిపెట్టింది ఏమిటి? కాస్ట్యూమ్స్. ఎస్... అదంతా ప్రముఖ డిజైనర్ నీతాలుల్లా క్రియేటివ్ మహిమ. ‘జోధా అక్బర్’లాంటి చరిత్రాత్మక చిత్రాలకు పనిచేసిన ఆమెతోపాటు మన హైదరాబాదీ విద్యార్థులూ తమ సృజనాత్మకతను పంచుకున్నారు. ఈ ప్రత్యేక దుస్తుల తయారీలో ఆమెకు సాయపడ్డ హ్యామ్స్‌టెక్ డిజైనింగ్ ఇన్‌స్టిట్యూట్ స్టూడెంట్స్ అపర్ణ, రవి వానమ్, రచనల ఎక్స్‌పీరియెన్స్ వారి మాటల్లోనే...
- సిరి
ఇది మాకు మొదటి చిత్రం. ఫస్ట్ మూవీలోనే లీడ్ యాక్టర్స్ కాస్ట్యూమ్స్‌కి అసిస్టెంట్‌గా పనిచేయడం సంతోషాన్నిస్తోంది. క్లాసులో నేర్చుకున్నది, ప్రాక్టికల్స్‌లో చేసినదానికంటే... ఆన్‌సెట్స్ ఎక్స్‌పీరిఎన్స్ కొత్తగా ఉంది. బాలీవుడ్‌లో స్థిరపడాలన్నది నా కోరిక.
- అపర్ణ
గతంలో రానా, ప్రకాష్‌రాజ్, కృష్ణంరాజు దగ్గర అసిస్టెంట్‌గా చేశాను. కానీ రుద్రమదేవి స్పెషల్. రానా బాడీకి, సినిమాలో ఆయన బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా డిజైన్ చేశాం. రానా గెటప్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక అనుష్క ధరిస్తున్న ఒరిజినల్ బంగారు ఆభరణాలకు తగ్గట్టుగా డ్రెస్ కలర్స్ ఉండేవిధంగా శ్రద్ధ తీసుకున్నాం. కొత్త టె క్నిక్స్ ఉపయోగించాం. గ్రేట్ ఆపర్చునిటీ!
- రవి వానమ్
నీతా లుల్లా మమ్మల్ని ఎంచుకోవడం మా అదృష్టం. రాజరికపు లోకాల్లోకి మనలను తీసుకెళ్లే సినిమా ఇది. అందుకు తగ్గట్టుగానే ప్రతి సెట్టింగ్, కాస్ట్యూమ్స్ ఉంటాయి. డెరైక్టర్ సూచనల మేరకు అనుష్క చేతులకు టాటూస్ వేశాను. నేను చాలా ఎగ్జైట్ అయిన మూమెంట్ అది.
- రచన