రుద్రమదేవి.. వచ్చేస్తోంది! | Rudrama devi coming soon, tweets rana daggubati | Sakshi
Sakshi News home page

రుద్రమదేవి.. వచ్చేస్తోంది!

Published Tue, Sep 15 2015 8:20 PM | Last Updated on Sun, Sep 3 2017 9:27 AM

రుద్రమదేవి.. వచ్చేస్తోంది!

రుద్రమదేవి.. వచ్చేస్తోంది!

గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన భారీ పౌరాణిక చిత్రం రుద్రమదేవి విడుదలకు ముహూర్తం దగ్గర పడింది. ఈ విషయాన్ని ఈ సినిమాలో చాళుక్య వీరభద్రుడి పాత్ర పోషించిన రానా దగ్గుబాటి మంగళవారం రాత్రి ట్వీట్ చేశాడు.

టైటిల్ రోల్లో అనుష్క, గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్, గణపతి దేవుడి పాత్రలో రెబల్ స్టార్ కృష్ణంరాజు తదితరులు నటించిన ఈ భారీ చిత్రం విడుదల ముహూర్తం ఎప్పుడన్నది మాత్రం ఇంతవరకు తెలియలేదు. అయితే, బాహుబలి తెలుగు సినిమా రికార్డులన్నింటినీ తిరగరాసిన తర్వాత.. దాదాపు అదే సమయంలో షూటింగ్ జరుపుకొన్న రుద్రమదేవి సినిమా ఎలా ఉంటుందన్న విషయంపై కూడా అంతా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమా త్వరలోనే విడుదల అవుతుందంటూ రానా చేసిన ట్వీట్.. అందరికీ ఆశలు కల్పిస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement