Rana Daggubati Sent A Gift To Anushka Setty, Anushka Shared Gift On Social Media - Sakshi
Sakshi News home page

అనుష్కకు ‘అరణ్య’ స్పెషల్‌ గిఫ్ట్‌

Published Fri, Mar 26 2021 12:09 PM | Last Updated on Fri, Mar 26 2021 1:05 PM

Rana Daggubati Sends A Gift To Anushka Shetty  - Sakshi

‘భళ్లాలదేవుడు’ రానా దగ్గుబాటి, ‘దేవసేన’ అనుష్క శెట్టికి పంపిన బహుమతి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తాజాగా రానా నటించిన ‘అరణ్య’ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రానా, అనుష్కకు ఓ గిఫ్టును పంపాడు. రానా పంపిన ఈ బహుమతిని అనుష్క సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ మురిసిపోయింది. అలాగే భళ్లాలదేవుడికి స్వీటి ధన్యవాదాలు తెలుపుతూ ‘అరణ్య’ మూవీ టీంకు శుభాకాంక్షలు తెలిపింది. అదే విధంగా రానా ఇలాంటి బహుమతులనే మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ భార్య ఉపాసనకు, అక్కినేని వారి కోడలు సమంత కూడా పంపాడు.

రానా పంపిన ఈ బహుమతులను ఉపాసన, సమంతలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అరణ్యకు మంచి హిట్ రావాలని ఆశించారు. కాగా అనుష్క చివరిగా నిశ్శబ్ధం మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనుష్క కొత్త చిత్రమేదీ ప్రకటించలేదు. ఏ సినిమా చేయబోతున్నారనేది కూడా ఎలాంటి స్పష్టత లేదు. అయితే స్వీటీ ఓ సినిమాకు కమిట్‌ అయ్యారనేది తాజా సమాచారం. సందీప్‌ కిషన్‌ హీరోగా ‘రారా కృష్ణయ్య’ చిత్రానికి దర్శకత్వం వహించిన పి. మహేశ్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయడానికి అనుష్క గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. సరికొత్త పాయింట్‌తో రూపోందనున్న ఈ మూవీలో అనుష్క, యంగ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టితో నటిస్తున్నట్లు సమాచారం.

చదవండి: 
‘అరణ్య’ మూవీ రివ్యూ 
యంగ్‌ హీరోతో రొమాన్స్‌ చేయనున్న అనుష్క!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement