
Rana Daggubati: భిన్న కథలు, విభిన్న సినిమాలు, డిఫరెంట్ రోల్స్‌తో అభిమానులను అలరిస్తుంటాడు రానా దగ్గుబాటి. తను ఎంచుకునే కథలన్నీ కూడా దేనికదే ప్రత్యేకంగా ఉంటాయి. లీడర్ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం టాలీవుడ్‌లో దిగ్విజయంగా కొనసాగుతోంది. హీరోగా, విలన్‌గా, వ్యాఖ్యాతగా, సహాయక నటుడిగా అన్నిరకాల పాత్రల్లో ఒదిగిపోతూ ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడాయన. ఈ భళ్లాల దేవ ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు పూర్తైంది. ఈ విషయాన్ని రానా ట్వీట్ ద్వారా తెలియజేశాడు.
'అర్జున్ ప్రసాద్(లీడర్) నుంచి డేనియల్ శంకర్(భీమ్లా నాయక్) వరకు.. అప్పుడే 12 ఏళ్లు పూర్తయ్యాయి. నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు.. మున్ముందు కూడా కొత్త కొత్త కథలు, పాత్రలను మీకు పరిచయం చేస్తాను' అని హామీ ఇచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు రానాకు శుభాకాంక్షలు చెప్తూ ఆయన చేసిన సినిమాల్లో తమకేది ఎక్కువ ఇష్టం అనేది చర్చిస్తున్నారు. ఇదిలా ఉంటే స్వీటీ అనుష్క శెట్టి రానా ట్వీట్ 'ఇలాగే ముందుకు సాగు బ్రో' అని రిప్లై ఇచ్చింది. ఇది చూసిన జనాలు స్వీటీ తన అన్నయ్యకు రిప్లై ఇచ్చిందిరో.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Great going bro 🥳❤️ https://t.co/GfizecD7LR
— Anushka Shetty (@MsAnushkaShetty) February 20, 2022
Comments
Please login to add a commentAdd a comment