‘టాప్’లో చేర్చడంపై జ్వాల సంతోషం | TOP scheme will help in planning our Olympics preparation: Jwala Gutta | Sakshi
Sakshi News home page

‘టాప్’లో చేర్చడంపై జ్వాల సంతోషం

Published Sat, Jul 18 2015 12:38 AM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM

‘టాప్’లో చేర్చడంపై జ్వాల సంతోషం

‘టాప్’లో చేర్చడంపై జ్వాల సంతోషం

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే అవకాశమున్న ఆటగాళ్ల కోసం ఏర్పాటు చేసిన ‘టాప్’ స్కీమ్‌లో ఎట్టకేలకు బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలకు చోటు లభించనుంది. తదుపరి విడుదల చేసే అథ్లెట్ల జాబితాలో ఈ జోడి పేరును క్రీడా శాఖ చేర్చనుంది.

 దీంతో జ్వాల తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఒలింపిక్స్ కోసం తమ సన్నాహకాలు మరింత బాగా సాగేందుకు ఇది దోహదపడుతుందని తెలిపింది. ‘చివరికి టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్)లో మా పేర్లను చేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు మరింత ప్రేరణగా నిలవడమే కాకుండా రియో కోసం బాగా సన్నద్ధమయ్యేందుకు తోడ్పడుతుంది. అయితే టాప్‌లో చోటు కోసం పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరం. మేం ఆ స్కీమ్‌పైనే ఆధారపడక పోయినా అందులో ఉండే హక్కు ఉందని గట్టిగా భావించాం’ అని 31 ఏళ్ల జ్వాల తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement