ప్రభుత్వం ఇప్పటికైనా తమకు మద్దతుగా నిలిచి సాయపడాలని కెనడా బ్యాడ్మింటన్ ఓపెన్ మహిళల డబుల్స్ విజేత, తెలుగుతేజం గుత్తా జ్వాల అన్నారు.
హైదరాబాద్: ప్రభుత్వం ఇప్పటికైనా తమకు మద్దతుగా నిలిచి సాయపడాలని కెనడా బ్యాడ్మింటన్ ఓపెన్ మహిళల డబుల్స్ విజేత, తెలుగుతేజం గుత్తా జ్వాల అన్నారు. వచ్చే ఒలింపిక్స్లో పతకం సాధించాలంటే తమను ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు. కెనడా ఓపెన్లో అశ్వినీ పొన్నప్పతో కలసి బరిలో దిగిన జ్వాల విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వం సింగిల్స్ క్రీడాకారులకు ఏవిధంగా సాయం చేస్తోందో, తమనూ అదేవిధంగా ప్రోత్సహించాలని జ్వాల అన్నారు. ఇప్పటికైనా డబుల్స్ క్రీడాకారులను గుర్తించడం సంతోషంగా ఉందని చెప్పారు. వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ డబుల్స్లో తమ జోడీ ప్రధాన పోటీదారని, తమకు సాయం చేయాలని జ్వాల కోరారు. కెనడా ఓపెన్లో తమ విజయం తర్వాతైనా క్రీడల శాఖ, అభిమానులు గుర్తించి తమకు అండగా నిలుస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.