
బర్త్ డే గాళ్ జ్వాల హంగామా
హైదరాబాద్: బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల 33వ ఏట అడుగుపెట్టారు. సోమవారం (సెప్టెంబర్ 7) జ్వాల పుట్టినరోజు. జ్వాల బర్త్ డే పార్టీలో సహచర క్రీడాకారులతో కలసి హంగామా చేశారు.
జ్వాల బర్త్ డే పార్టీకి బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, జ్వాల డబుల్స్ పార్టనర్ అశ్వినీ పొన్నప్ప, కోన తరుణ్ హాజరయ్యారు. జ్వాల కేక్ కట్ చేసి సహచర క్రీడాకారులతో కలసి పార్టీ చేసుకున్నారు. జ్వాల ముఖానికి కేక్ పట్టించి వాళ్లంతా హంగామా చేశారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫొటోలను జ్వాల ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
My sweeetieeeesssss