న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు తేజాలు సాయి ప్రణీత్, డబుల్స్లో గుత్తా జ్వాల జోడీ, సుమీత్ రెడ్డి జోడీలు సెమీస్కు దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో సాయి ప్రణీత్ 21-8 21-14 స్కోరుతో క లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై విజయం సాధించాడు. మహిళల డబుల్స్లో గుత్తా జ్వాల, అశ్వినీ పొన్నప్ప 21-17 21-14 తో జర్మనీ జంట జొహన్నా గోలిస్జెస్కీ, కార్లా నెల్టెపై గెలుపొందారు. ఇక పురుషుల డబుల్స్లో సుమీత్ రెడ్డి, మను అట్రి 22-20 21-13తో ఇంగ్లండ్ ద్వయం మార్కస్ ఎలిస్, క్రిస్ లాంగ్రైడ్ను ఓడించారు.