
గుత్తా జ్వాల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల అసహనం వ్యక్తం చేశారు. బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు సహకరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటికీ ఆ దిశగా అడుగులు వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లు గడిచినా ఇప్పటి వరకు స్థలం కేటాయించలేదని, ఇంటిస్థలం ఇస్తామని ఇవ్వలేదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, సీఎంవోకు ట్వీట్ చేశారు. అథ్లెట్స్‌కి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాల కింద.. ప్లాట్‌ని ప్రకటించిందని.. అందులో భాగంగానే తనకు హామీ ఇచ్చారని, తను అడగలేదని పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ తనకు మాత్రం ఆ ప్రోత్సాహకం అందలేదని గుత్తాజ్వాల ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఏడాది క్రీడల మంత్రి పద్మారావుని కలిసిన గుత్తాజ్వాల రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై ఆయనతో చర్చించారు. గత కొంతకాలంగా బ్యాడ్మింటన్‌లో రాజకీయాలపై బహిరంగంగానే పెదవి విరుస్తున్న గుత్తాజ్వాల.. ఇప్పుడు పూర్తిగా ఆటకి దూరమై అకాడమీని స్థాపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
@KTRTRS @TelanganaCMO
— Gutta Jwala (@Guttajwala) August 6, 2018
I have been after the TELANGANA govt too for some support to establish an academy for past 4 years but in vain...was promised I would be given the support but......
Also was promised a plot for house but every athlete seems to have got it except me!!
Comments
Please login to add a commentAdd a comment