ఫైనల్లో సుమీత్ జోడీ.. జ్వాల అవుట్ | Attri-Reddy in finals of US Open; Praneeth, Jwala-Ashwini out | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సుమీత్ జోడీ.. జ్వాల అవుట్

Published Sun, Jun 21 2015 4:38 PM | Last Updated on Sun, Sep 3 2017 4:08 AM

ఫైనల్లో సుమీత్ జోడీ.. జ్వాల అవుట్

ఫైనల్లో సుమీత్ జోడీ.. జ్వాల అవుట్

న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సుమీత్ రెడ్డి జోడీ ఫైనల్కు దూసుకెళ్లగా, సాయి ప్రణీత్, గుత్తా జ్వాల పోరాటం ముగిసింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీస్లో సుమీత్, మను అట్రి 21-17 21-17 స్కోరుతో జపాన్ జోడీ టకేషి కముర, కీగో సొనోడాపై విజయం సాధించారు.

కాగా పురుషుల సింగిల్స్  సెమీస్లో  సాయి ప్రణీత్ 9-21 17-21తో లీ చోంగ్ వీ (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్లో గుత్తా జ్వాల, అశ్వినీ పొన్నప్ప 17-21 11-21 కురిహర, నర షినోయ (జపాన్) చేతిలో ఓడిపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement