సాక్షి, హైదరాబాద్: ఫోన్ నెట్‌వర్క్ ఒక్కటే కాదు.. క్రీడల్లోనూ రాణిస్తామని నిరూపించుకునేందుకు బ్యాడ్మింటన్ కోర్టులో దిగారు బీఎస్‌ఎన్‌ఎల్(BSNL) ఉద్యోగులు. ఏటా జరిగే ఆల్ ఇండియా బీఎస్‌ఎన్‌ఎల్ బ్యాడ్మింటన్ పోటీలు ఈసారి సికింద్రాబాద్ రైల్వే నిలయం స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా మూడు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ పోటీలను అర్జున అవార్డు గ్రహీత, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ప్రారంభించారు.
ఈ సందర్భంగా... ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నదని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, అలాగే శారీరకంగా ధృడంగా ఉంచుతాయన్నారు జ్వాల. ఈ కార్యక్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్(BSNL) సీజీఎం చాగంటి శ్రీనివాస్, హెచ్‌ఆర్ జనరల్ మేనేజర్ మహేంద్ర భాస్కర్, పీజీఎంఎస్ కేవీకే ప్రసాద్ రావు, ఎన్ మురళి, శ్రీమతి సుజాత, డీజీఎం చంద్రశేఖర్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: PC Vs PR: ఆదుకున్న బట్లర్.. ఓడినా సెమీస్‌కు దూసుకెళ్లిన రాయల్స్! టాప్-4లో సన్‌రైజర్స్ కూడా..
Ajinkya Rahane: ఏమైపోయావు; రెండేళ్ల క్రితం హీరో.. ఇప్పుడు జీరో
Comments
Please login to add a commentAdd a comment