Jwala
-
థ్రిల్లింగ్ జ్వాల
‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులను సంపాదించుకున్నారు తమిళ నటుడు విజయ్ ఆంటోని. ఆయన హీరోగా రూపొందు తోన్న తాజా చిత్రం ‘జ్వాల’. నవీన్.యమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెలుగులో ‘జ్వాల’గా, తమిళ్లో ‘అగ్ని శిరగుగళ్’ పేరుతో తెరకెక్కుతోంది. శర్వంత్‌రామ్ క్రియేషన్స్ పతాకంపై జవ్వాజి రామాంజనేయులు, షిరిడిసాయి క్రియేషన్స్ పతాకంపై యమ్. రాజశేఖర్ రెడ్డి తెలుగులో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా యమ్. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ఉజ్బెకిస్తాన్, కజికిస్తాన్ దేశాలతో పాటు యూరప్‌లోని పలు దేశాల్లో చిత్రీకరణ జరిపాం. ఆఖరి షెడ్యూల్ కోల్‌కత్తాలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. విజయ్ ఆంటోని కెరీర్లోనే దాదాపు 25కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న తొలి చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన అక్షరాహాసన్ నటిస్తుండగా, ‘సాహో’ ఫేమ్ అరుణ్ విజయ్, రీమాసేన్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: నటరాజన్. -
రగిలిన జ్వాల
ఇప్పటి వరకూ అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తెలుగులో చేస్తున్న స్ట్రయిట్ మూవీ ‘జ్వాల’. అరుణ్ విజయ్ మరో కథా నాయకుడు. ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే కథానాయికగా నటిస్తున్నారు. ఎం. నవీన్ దర్శకత్వంలో టి. శివ నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. విజయ్ ఆంటోని మాట్లాడుతూ–‘‘తెలుగులో నేను చేస్తున్న స్ట్రయిట్ చిత్రమిది. నవీన్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చింది. నాతో పాటు అరుణ్‌విజయ్, షాలినీ పాండేకి కూడా ఇది చాలెంజింగ్ మూవీ. నా కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ మూవీస్‌గా ఉంటుందని చెప్పగలను. ఈ సినిమాలో కీలక పాత్రలు చేయడానికి అంగీకరించిన ప్రకాశ్‌రాజ్, జగపతిబాబుగార్లకి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘బ్రూస్ లీ, సాహో’ చిత్రాల తర్వాత నేను నటిస్తున్న మూడో స్ట్రయిట్ తెలుగు చిత్రమిది. చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ఇలాంటి యాక్షన్ చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు అరుణ్ విజయ్. ‘‘ఈ చిత్రం షూటింగ్లో పాల్గొనడానికి ఎగై్జటింగ్‌గా ఎదురుచూస్తున్నా’’ అన్నారు షాలినీ పాండే. ఈ సినిమాకు నటరాజన్ సంగీతం అందిస్తున్నారు. -
విడిపోయిన జ్వాల-అశ్విని జోడీ
పొన్నప్పకు జతగా సిక్కిరెడ్డి న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్‌లో విజయవంతమైన మహిళల జోడీ గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప విడిపోయింది. ఇద్దరి మధ్య సమన్వయలోపం పెరగడం... ఆశించిన ఫలితాలు కూడా రాకపోవడం... తదితర కారణాలతో స్నేహపూరిత వాతావరణంలో, పరస్పర అంగీకారంతో ఈ ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. 33 ఏళ్ల జ్వాల ఇక నుంచి కేవలం మిక్స్డ్ డబుల్స్‌కే పరిమితం కానుంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మనూ అత్రితో కలిసి జ్వాల మిక్స్డ్ డబుల్స్‌లో ఆడనుంది. మరోవైపు అశ్విని పొన్నప్ప మాత్రం మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డితో... మిక్స్డ్ డబుల్స్‌లో నందగోపాల్‌తో కలిసి టోర్నీల్లో పాల్గొంటుంది. రియో ఒలింపిక్స్ కంటే ముందుగానే తామీ నిర్ణయం తీసుకున్నామని జ్వాల, అశ్విని వివరించారు. -
స్వర్ణాల సెంచరీ పూర్తి
ఐదో రోజూ భారత్‌దే జోరు ఒకేరోజు 39 స్వర్ణాలుబ్యాడ్మింటన్లో రుత్విక సంచలనంఫైనల్లో సింధుపై విజయంతో స్వర్ణందక్షిణాసియా క్రీడలు గువాహటి/షిల్లాంగ్: బరిలోకి దిగిన ప్రతీ ఈవెంట్లోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్న భారత క్రీడాకారులు దక్షిణాసియా క్రీడల్లో పసిడి పంటను పండిస్తున్నారు. పోటీల ఐదో రోజూ భారత్ ఏకంగా 39 స్వర్ణాలు సాధించి పతకాల పట్టికలో ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకుంది. బుధవారం జరిగిన క్రీడాంశాల్లో బ్యాడ్మింటన్, షూటింగ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్‌లలో భారత క్రీడాకారులు అందుబాటులో ఉన్న అన్ని స్వర్ణాలు సొంతం చేసుకొని క్లీన్‌స్వీప్ చేశారు. ప్రస్తుతం భారత్ 117 స్వర్ణాలు, 61 రజతాలు, 16 కాంస్యాలతో 194 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. డబుల్స్‌లో సిక్కి, జ్వాల, సుమీత్‌లకు స్వర్ణాలు షటిల్ బ్యాడ్మింటన్‌లో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో భారత్‌కు బంగారు పతకాలు లభించాయి. స్వర్ణం నెగ్గిన ప్రతి ఈవెంట్లో తెలంగాణ క్రీడాకారులు (రుత్విక, శ్రీకాంత్, గుత్తా జ్వాల, సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డి) ఉండటం విశేషం. మహిళల సింగిల్స్‌లో యువతార గద్దె రుత్విక శివాని పెను సంచలనం సృష్టించింది. ప్రపంచ 12వ ర్యాంకర్, తెలంగాణకే చెందిన పీవీ సింధుతో జరిగిన ఫైనల్లో ప్రపంచ 131వ ర్యాంకర్ రుత్విక 21-11, 22-20తో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ‘మ్యాచ్ సంగతి అటుంచితే సింధుపై ఇప్పటివరకు ఒక్క గేమ్ కూడా గెలువలేదు. ఈ విజయం అనూహ్యం, అద్భుతం. నా కెరీర్లో ఇవి మధుర క్షణాలు. నమ్మశక్యంకాని విజయంతో నా కళ్లలోంచి ఆనందబాష్పాలు వస్తున్నాయి’ అని సింధును ఓడించిన తర్వాత రుత్విక వ్యాఖ్యానించింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ 11-21, 21-14, 21-6తో హెచ్ఎస్ ప్రణయ్ (భారత్)పై గెలిచి స్వర్ణం సాధించాడు. మహిళల డబుల్స్ ఫైనల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 21-9, 21-7తో సిక్కి రెడ్డి-మనీషా (భారత్) జంటపై గెలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) జోడీ 21-18, 21-17తో అక్షయ్ దేవాల్కర్-ప్రణవ్ చోప్రా (భారత్) జంటపై నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా (భారత్) జంట 30-29, 21-17తో మనూ అత్రి-అశ్విని పొన్నప్ప జోడీని ఓడించింది. టేబుల్ టెన్నిస్‌లోనూ భారత్‌కు ఎదురులేకుండాపోయింది. పురుషుల సింగిల్స్‌లో ఆంథోనీ అమల్‌రాజ్, మహిళల సింగిల్స్‌లో మౌమా దాస్... మహిళల డబుల్స్‌లో మణిక బాత్రా-పూజా సహస్రబుద్ధే జోడీ... పురుషుల డబుల్స్‌లో సత్యన్-దేవేశ్ కరియా జంట విజేతలుగా నిలిచి పసిడి పతకాలు కైవసం చేసుకున్నాయి.టెన్నిస్‌లో భారత్‌కు మూడు బంగారు పతకాలు లభించాయి. పురుషుల డబుల్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్-విజయ్ సుందర్ ప్రశాంత్, మహిళల సింగిల్స్‌లో అంకిత రైనా (భారత్), మిక్స్డ్ డబుల్స్‌లో అంకిత రైనా-దివిజ్ శరణ్ స్వర్ణాలు సాధించారు. స్క్వాష్‌లో తొలిసారి...దక్షిణాసియా క్రీడల చరిత్రలో తొలిసారి ఏకకాలంలో భారత పురుషుల, మహిళల జట్లు స్క్వాష్ ఈవెంట్లో విజేతగా నిలిచాయి. పురుషుల టీమ్ ఫైనల్లో సౌరవ్ ఘోషాల్, రవి దీక్షిత్, కుష్ కుమార్, హరీందర్ పాల్ సంధూలతో కూడిన భారత బృందం 2-1తో పాకిస్తాన్‌ను బోల్తా కొట్టించగా... జోష్నా చినప్ప, దీపిక, సునయన, ఆకాంక్షలతో కూడిన భారత మహిళల జట్టు 2-0తో పాకిస్తాన్‌ను ఓడించింది. అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఒకేరోజు పది పసిడి పతకాలు వచ్చాయి. మహిళల లాంగ్‌జంప్‌లో మయూఖా జానీ, 400 మీటర్ల రేసులో ఎంఆర్ పూవమ్మ, 100 మీటర్ల హర్డిల్స్‌లో గాయత్రి, హైజంప్‌లో సహన కుమారి... పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా, 400 మీటర్ల రేసులో అరోక్య రాజీవ్, డిస్కస్ త్రోలో అర్జున్, లాంగ్‌జంప్‌లో అంకిత్ శర్మ, 10 వేల మీటర్ల రేసులో గోపీ స్వర్ణాలు నెగ్గారు.షూటింగ్లో భారత్‌కు మూడు స్వర్ణాలు దక్కాయి. మహిళల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో అపూర్వీ చండీలా విజేతగా నిలిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో, పురుషుల 50 మీటర్ల టీమ్ పిస్టల్ ఈవెంట్లోనూ భారత్‌కు పసిడి పతకాలు లభించాయి.స్విమ్మింగ్‌లో పురుషుల 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో వీర్‌ధవల్ ఖాడే, మహిళల 200 మీటర్ల మెడ్లేలో శ్రద్ధ సుధీర్, 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో జ్యోత్స్న పన్సారె విజేతలుగా నిలిచారు. 4ఁ100 మీటర్ల పురుషుల, మహిళల రిలే రేసుల్లోనూ భారత్‌కు స్వర్ణాలు లభించాయి. వుషు క్రీడాంశంలో జ్ఞాన్దశ్ సింగ్ (తైజిక్వాన్, తైజియాన్)... సంతోంబి చాను (తైజిక్వాన్, తైజియాన్) పసిడి పతకాలు సాధించారు. ఈ ఇద్దరే కాకుండా పురుషుల సాన్‌షూ ఈవెంట్లో ఉచిత్ శర్మ (52 కేజీలు), రవి పాంచాల్ (56 కేజీలు), సూర్య భానుప్రతాప్ సింగ్ (60 కేజీలు)... మహిళల సాన్‌షూ ఈవెంలో సనతోయ్ సింగ్ (52 కేజీలు), అనుపమా దేవి (60 కేజీలు), పూజా కడియాన్ (70 కేజీలు) స్వర్ణ పతకాలను దక్కించుకున్నారు. -
కీచక సంహారం కోసం....
మాటలు: రామ్‌ప్రసాద్ యాదవ్; పాటలు: వెన్నెలకంటి, రామజోగయ్య శాస్త్రి, గోరటి వెంకన్న; సంగీతం: డాక్టర్ జోస్యభట్ల; కెమెరా: కమలాకర్; నిర్మాత: పర్వతరెడ్డి కిశోర్‌కుమార్; కథ- స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: ఎన్.వి.బి. చౌదరి ఆడవారిని కేవలం ఆటవస్తువులుగా చూసే మనస్తత్త్వం నుంచి బయటపడని పురుషాధిక్య ప్రపంచం మనది. ఆడవారి పట్ల భరించలేనివెన్నో జరుగుతూ ఉంటాయి. యథార్థగాథలైనప్పటికీ అతి జుగుప్సాకరమైన అలాంటి అంశాలను సినిమా లాంటి మాస్మీడియవ్ులో ఎంతవరకు చూపించాలి?... వాటిని న్యూస్ రిపోర్ట్ స్థాయి నుంచి మూవీ ఆర్ట్ స్థాయికి ఎంతవరకు తేవాలంటే ఎప్పుడూ చర్చే. ఆ చర్చకు మరోసారి తావిస్తూ వచ్చిన సినిమా ‘కీచక’. కథగా చెప్పాలంటే... సుజాత (యామినీ భాస్కర్) హైదరాబాద్‌లో సాఫ్ట్వేరింజనీర్. టీమ్‌తో కలసి చేపట్టిన ప్రాజెక్టుల్ని విజయవంతంగా పూర్తి చేసే ఆమె ఈసారి ఒంటరిగా ఒక ప్రాజెక్ట్‌ను తలకెత్తుకుంటుంది. అది ఏమిటంటే - ఊళ్ళోని గాంధీనగర్ బస్తీలో ‘కీచకుడి’గా తిరుగుతున్న కోటి (జ్వాలా కోటి)ని ఎలాగైనా చంపేయడం! ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ, కోటి ఉండే పేరుమోసిన బస్తీకి వస్తుంది. ఆ బస్తీకి 20 ఏళ్ళుగా మకుటం లేని మహారాజు - కోటి. వంద మర్డర్లు, 300 రేప్‌లు చేసిన చరిత్ర అతనిది. అయితే, భయంతో బస్తీవాసులు, రాజకీయ నాయకుల ప్రమేయం వల్ల పోలీసులు - అతణ్ణి ఏమీ చేయలేకపోతుంటారు. బస్తీకి ఒక సామాన్య మహిళగా వచ్చిన హీరోయిన్‌కు అతని మీద అంత పగ ఎందుకు అన్నది చిన్న ఫ్లాష్‌బ్యాక్‌లో చూపిస్తారు. మరోపక్క ఆమెను ఎలాగైనా అనుభవించాలనుకుంటాడు విలన్. అతణ్ణి ఏమారుస్తూనే, బస్తీలో అందరి ఎదుటే అతణ్ణి ఎదిరిస్తుంది హీరోయిన్. ఆమె ఇచ్చిన ధైర్యంతో జనమేం చేశారన్నది మిగతా స్టోరీ. ఈ సినిమాకు కీలకమైన హీరోయిన్, విలన్... పాత్రధారులిద్దరూ ఆ పాత్రలకు తగ్గట్లు, చూడడానికి బాగున్నారు. క్రూరమైన విలన్ పాత్రకు జ్వాలా కోటి సరిగ్గా సరిపోయారు. సైకిల్ మీద క్యారియర్‌లో ఇడ్లీలమ్మే దాసు పాత్రలో రఘుబాబు అలవాటైన తన కామెడీకి భిన్నంగా సెంటిమెంటల్‌గా కనిపిస్తారు. ఆ పాత్ర ముగింపు, ఆయన నటన బాగున్నాయి. పరిమితమైన వనరులతో తీసిన ఈ సినిమాకు ఉన్నంతలో కెమేరా, రీరికార్డింగ్ వర్క బాగున్నాయి. సినిమా మొదలైన కాసేపటికే హీరోయిన్ లక్ష్యమేమిటో, దానికి కారణమేమిటో కూడా చెప్పేశారు. దాంతో, తరువాతంతా లక్ష్యాన్ని ఆమె ఎలా చేరుకుందన్నదే! దాన్ని ఆసక్తిగా చెప్పాల్సింది. మళ్ళీ మళ్ళీ అవే తరహా రేప్ దృశ్యాలు, నేపథ్య గీతాలు, ఒక ప్రత్యేక నృత్య గీతం, ఇంకా విలన్ ముఠా మాటలు, చేష్టలతో సినిమాను 111 నిమిషాల నిడివికి చేర్చారు. చిత్రంగా, విలన్‌ను చంపడమే ధ్యేయంగా కత్తి పట్టుకు తిరిగిన కథానాయిక ఆఖరుకి అదే కత్తితో విలన్ చేతిలో పోట్లు తింటుంది. అంతటి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బస్తీకి పోగానే, ఆటోడ్రైవర్‌తో ప్రేమలో మునగడంలో లాజిక్ వెతకడం కన్నా సినిమాటిక్ సృజన అని తృప్తిపడిపోతే గొడవుండదు. అత్యాచారానికి గురైన స్త్రీ ఆ దుర్మార్గానికి పాల్పడిన విలన్‌పై పగ తీర్చుకోవడమనే ఫార్ములా తాతల కాలం నాటిదే. కాకపోతే దాన్ని నిజజీవిత ఘటనకూ, స్త్రీ చైతన్యానికీ ముడిపెట్టడమే తాజాదనం. సీను సీనుకీ రేప్ దృశ్యం, సైకో తరహా శాడిజమ్, అనేకానేక ఆడియో కట్స్‌తో మనసును డిస్ట్రబ్ చేసే సంఘటనల సమాహారం ‘కీచక’. నాగపూర్ ప్రాంతంలో అక్కూ యాదవ్ అనే వీధి రౌడీ జీవితం స్ఫూర్తితో ఈ సినిమా కథను అల్లుకున్నారట. ఈ చిత్ర దర్శకుడు ఒకప్పుడు టీవీ చానల్స్‌లో పనిచేసిన జర్నలిస్టు -
జ్వాలా అశ్విని మధ్య ఫైర్