
శ్రావణి, ధ్రువ
ధ్రువ హీరోగా, శ్రావణి, అశ్విని హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘యమ్6’. జైరామ్ దర్శకత్వంలో స్టార్ యాక్టింగ్ స్టూడియో సమర్పణలో విశ్వనాథ్ తన్నీరు, సురేశ్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. విశ్వనాథ్ తన్నీరు మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. ఇందులోని ‘ఈ క్షణం..’ అనే మెలోడియస్ పాటను అరకు, మంగళూరులోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం.
క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా నిర్మించాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో సస్పెన్స్‌తో పాటు కామెడీ, యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయి. చక్కని ఫొటోగ్రఫీ, వీనుల విందైన సంగీతం అదనపు ఆకర్షణ’’ అన్నారు జైరామ్. ‘‘ఇది నా తొలి చిత్రం. ఓ మంచి సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు రుణపడి ఉంటాను’’ అన్నారు ధ్రువ. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బాలాజీ, కెమెరా: మహ్మద్ రియాజ్.
Comments
Please login to add a commentAdd a comment