విశ్వనాథ్ తన్నీరు
ధ్రువ హీరోగా, శ్రావణి, అశ్విని హీరోయిన్లుగా జైరామ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యమ్6’. విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మీ వెంకటాద్రి క్రియేషన్స్ పతాకాలపై విశ్వనాథ్ తన్నీరు నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. చిత్రనిర్మాత విశ్వనాథ్ తన్నీరు మాట్లాడుతూ– ‘‘సినిమాపై ప్యాషన్‌తోనే ఇండస్ట్రీకి వచ్చాను. మొదట్లో కొన్ని సీరియల్స్‌లో నటించడంతో పాటు నిర్మించాను. కొన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. నా తమ్ముడు ధ్రువని హీరోగా పరిచయం చేస్తూ ‘యమ్6’ చిత్రాన్ని నిర్మించాను.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే... జైరాం వర్మ చెప్పిన కథ నచ్చి ఈ సినిమా నిర్మించా. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందింది. కామెడీ, యాక్షన్ సన్నివేశాలతో పాటు ఓ సందేశం కూడా ఉంటుంది. త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. మా బేనర్‌లో సంవత్సరానికి ఒక సినిమా నిర్మిస్తాం. త్వరలోనే నా డైరెక్షన్‌లో ఓ సినిమా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బాలాజీ, కెమెరా: మహ్మద్ రియాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సురేశ్, సమర్పణ: స్టార్ యాక్టింగ్ స్టూడియో.
Comments
Please login to add a commentAdd a comment