టిల్లులో రాధికలా... | Bigg Boss Fame Ashwini Sree New Movie Opening | Sakshi
Sakshi News home page

టిల్లులో రాధికలా...

Published Sun, Apr 7 2024 2:30 AM | Last Updated on Sun, Apr 7 2024 2:30 AM

Bigg Boss Fame Ashwini Sree New Movie Opening - Sakshi

‘బిగ్‌ బాస్‌’ ఫేమ్‌ అశ్విని శ్రీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘మిస్‌ జానకి’ప్రారంభోత్స వం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. తొలి సన్నివేశానికి నిర్మాత సి. కల్యాణ్‌ క్లాప్‌ ఇచ్చారు. సతీష్‌కుమార్‌ దర్శకత్వంలో నాగరాజు నెక్కంటి నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 20నప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా అశ్వినీ మాట్లాడుతూ– ‘‘మిస్‌ జానకి’ కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ‘డీజే టిల్లు’ సినిమాలోని రాధిక పాత్రలా, ఈ సినిమాలో నేను చేసే జానకి పాత్ర కూడా గుర్తుండిపోతుందనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి’’ అన్నారు దర్శక–నిర్మాతలు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement