చోరీకి వచ్చి చంపేశారు.. | thief murdered girl in yadradri | Sakshi
Sakshi News home page

చోరీకి వచ్చి చంపేశారు..

Published Mon, Oct 9 2017 6:38 AM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM

ఇంట్లో దొంగతనానికి వచ్చిన దుండగులు బాలికను హతమార్చారు. ఈ ఘటన యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం జైకేసారంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాలమాకులు మల్లయ్య, పద్మ దంపతులకు కుమార్తె అశ్విని (16), కుమారుడు కిరణ్‌ సంతానం. ఆదివారం సెలవు కావడంతో ఇంటి వద్దనే ఉంది. తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లగా తమ్ముడు మిత్రులతో ఆడుకునేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువా, సూట్‌కేసును పగులగొట్టారు. ఇతర సామగ్రిని చిందర వందరగా పడేశారు. వారిని అశ్విని ప్రతిఘటించటంతో ఆమెను చంపాలనుకున్నారు. అక్కడే గుళికల మందు ప్యాకెట్‌ను గుర్తించారు. నీటిలో కలిపి బాలికకు తాగించి ఇంటి తలుపులు వేసి వెళ్లిపోయారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement