స్టార్ హీరో వారసుడు తెరంగేట్రం.. డైరెక్టర్‌గా ఎవరంటే? | Star Hero Son Ready To Debut In Films Director Reveals the Details | Sakshi

Vijay Sethupathi: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న వారసుడు.. డైెరెక్టర్‌గా ఆయనే!

Published Fri, Nov 24 2023 4:10 PM | Last Updated on Fri, Nov 24 2023 4:37 PM

Star Hero Son Ready To Debut In Films Director Reveals the Details - Sakshi

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి స్టార్‌గా ఎదిగిన వాళ్లు చాలా కొద్దిమందే ఉంటారు. అలాంటి వారిలో ముందు వరసలో ఉంటారాయన. ‍అలా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ సేతుపతి. ఉప్పెన సినిమాలో కృతిశెట్టికి తండ్రిగా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా తండ్రిబాటలోనే పయనించేందుకు ఆయన వారసుడు వచ్చేస్తున్నాడు. విజయ్ సేతుపతి కుమారుడు సూర్య తెరంగేట్రానికి అంతా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి 'ఫీనిక్స్' ‍అనే టైటిల్ కూడా ఖరారైనట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి సీనియర్ స్టంట్ మాస్టర్ అరసు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని ఏకే బ్రేవ్‌మన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంతో అరసు డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. గతంలో ఆయన ఇండియన్‌ 2, జవాన్‌ సినిమాలకు స్టంట్ మాస్టర్‌గా పనిచేశారు. 

కాగా.. ఆయన కుమారుడు సూర్య 'నానుమ్ రౌడీ ధాన్'లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. ఆ తర్వాత 'సింధుబాద్'చిత్రంలో సహాయక పాత్రలో కనిపించారు. వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'విడుతలై పార్ట్ 2'లో సూర్య కనిపించనున్నారు. కాగా... ఈ చిత్రానికి సీఎస్  శ్యామ్ సంగీతమందిస్తున్నారు. నటీనటులకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని డైరెక్టర్ అరసు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement