
అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'ఆదిపురుష్' విడుదలకు సిద్ధమైంది. కానీ, సినిమా పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ప్రారంభమైన విమర్శలు.. ఇప్పటి వరకు కూడా చల్లారలేదు. ఇంతలో తిరుమలలో హీరోయిన్ కృతీ సనన్‌ను దర్శకుడు ఓం రౌత్ హత్తుకుని బుగ్గపై ముద్దుపెట్టడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా ఈ వివాదంపై నటి కస్తూరి స్పందిస్తూ ‘ఆదిపురుష్’ పోస్టర్‌పై విమర్శల వర్షం కురిపించింది. ప్రభాస్ లుక్ చూస్తుంటే కర్ణుడు గుర్తుకువస్తున్నారని పేర్కొంది.
(ఇదీ చదవండి: నయనతార గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టిన విఘ్నేశ్ శివన్, పిల్లల్ని చూశారా?)
శ్రీరాముడితో పాటు ఆయన సోదరుడు లక్ష్మణుడిని మీసాలతో చూపించడం ఏమిటని దర్శకుడిని తప్పుబట్టింది. మరీ ముఖ్యంగా ప్రభాస్‌ను ఉద్దేశిస్తూ.. 'టాలీవుడ్‌లో ఎంతోమంది నటులు శ్రీరాముడి పాత్రల్లో తెరపై అద్భుతంగా కనిపించారు. కానీ, ‘ఆదిపురుష్’లో ప్రభాస్ రాముడిగా కాకుండా కర్ణుడిగా కనిపిస్తున్నారు' అని ఆమె కామెంట్ చేసింది. కస్తూరి వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కొంతమంది ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తుంటే.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం కస్తూరి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు.
(ఇదీ చదవండి: డబ్బులిచ్చి మరీ నన్ను తిట్టిస్తున్నారు.. విజయ్ దేవరకొండ మనిషే చెప్పాడు)
Comments
Please login to add a commentAdd a comment