Ananya Nagalla Shared Hot Pics, Netizens Bold Comments - Sakshi
Sakshi News home page

Ananya Nagalla: ఫోటోలు షేర్‌ చేసిన అనన్య నాగళ్ల.. బ్యాడ్‌ కామెంట్లతో నెటిజన్స్‌

Published Tue, Jul 18 2023 9:28 AM | Last Updated on Tue, Jul 18 2023 9:46 AM

Ananya Nagalla Photos Share Negative Comments Netizens - Sakshi

టాలీవుడ్‌లో 2019 లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో అనన్య నాగళ్ల ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో తన నటనతో మంచి క్రేజ్‌ తెచ్చుకుంది.  దీంతో  పవన్​ కల్యాణ్​ చిత్రం 'వకీల్​ సాబ్'​తో మరింత ఫేమస్​ అయింది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఆమెకు అన్ని చిన్న చిన్న పాత్రలే వచ్చాయే కానీ లీడ్‌ రోల్‌లో నటించే పాత్ర దక్కలేదనే చెప్పాలి. సమంత లీడ్​ రోల్​ పోషించిన శాకుంతల చిత్రంలోనూ అనన్య ఓ మంచి పాత్రలో కనువిందు చేసింది. తనలో మంచి టాలెంట్‌ ఉన్నప్పటికి అవకాశాలు మాత్రం చెప్పుకోతగిన విదంగా రాలేదనే చెప్పవచ్చు.

(ఇదీ చదవండి: విడాకుల బాటలో కలర్స్ స్వాతి.. నిహారిక,సమంత మాదిరే క్లూ ఇచ్చేసిందంటూ..)

ఈ మధ్యే విడుదలైన 'బేబీ' సినిమా హీరోయిన్‌ వైష్ణవి చైతన్య కూడా టాలెంట్‌ ఉన్నప్పటికీ తనకు సరైన గుర్తింపు దక్కేందుకు 8 ఏ‍ళ్లు పట్టింది. అదే విదంగా ఈ తెలుగు బ్యూటీకి కూడా ఏదో ఒకరోజు మంచి అవకాశం రాకపోతుందా..? అని తన సినీ ప్రయత్నాన్ని మాత్రం ఆపడం లేదు. ఇందులో భాగంగానే సోషల్​మీడియాలో ఈ బ్యూటీ ఫుల్‌ యాక్టివ్‌లో ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్​ హాట్​ ఫొటోలను షేర్​ చేస్తుంటుంది. తన అందంతో ఫాలోవర్స్​ను అలరిస్తుంటుంది.

(ఇదీ చదవండి: 50 దాటేసిన వరలక్ష్మి ... అప్పట్లో ఈ బ్లాక్‌ బస్టర్‌ సినిమా చేసుంటేనా?)

తాజాగా ఈ భామ కొన్ని ఫోటోలతో పాటు వీడియో కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో  షేర్‌ చేసింది. అందులో  అనన్య గెంతులు వేస్తున్నట్లు కనిపించింది. అయితే ఆ వీడియో చూసిన కొందరు నెటిజన్లు భారీగానే నెగటివ్‌ కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫోటోలను పలు సోషల్‌ మీడియాలో కూడా షేర్‌ చేస్తున్నారు. ఇంత చిన్న వయసులోనే అంత బరువును ఎలా మోస్తున్నారంటూ తన బాడీ గురించి  బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ తనుకు ఇలాంటి కామెంట్లు కొత్తేమీ కాదు. వీటిని తను పెద్దగా సీరియస్‌గా కూడా తీసుకోదని తెలుస్తోంది. ఎందుకంటే ఎవరెన్ని కామెంట్లు చేసినా తన పని తాను చేసుకుంటూ మళ్లీ రోజు సరికొత్త ఫోటోలతో తన అభిమానులను అలరిస్తుంది ఈ బ్యూటీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement