పాట్నా: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర బీహార్‌లో రెండోరోజు కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల అత్యుత్సాహంతో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. బుధవారం కథిహార్‌లో ఈ ఘటన జరిగింది.
రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర బీహార్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇటీవలి అక్కడి రాజకీయ పరిణామాలతో సంబంధం లేకుండా ఆయనకు బ్రహ్మరథం పట్టారు అక్కడి ప్రజలు. ఇక ఇవాళ ఉదయం డీఎస్ కాలేజీ వద్ద ఆయన ర్యాలీ నిర్వహించగా.. కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఆయన కారు మీదకు ఎక్కి నినాదాలు చేసే యత్నం చేశారు. ఈ క్రమంలో కారు విండ్‌షీల్డ్ పగిలిపోయింది. దీంతో రాహుల్ భద్రతా సిబ్బంది వారిని వారించి కిందకు దించగా.. పగిలిన కారు అద్ధాలతోనే ఆయన ర్యాలీని ముందుకు సాగించారు.
ఇదిలా ఉంటే.. మహాఘట్ బంధన్ కూటమి నుంచి నిష్క్రమించి తిరిగి బీజేపీతో జట్టు కట్టి ప్రభుత్వం ఏర్పాటు చేశారు నితీశ్ కుమార్. దీంతో రాహుల్ యాత్ర బీహార్‌లో ఎలా సాగుతుందా? అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే నిన్న రాహుల్ యాత్రకు అపూర్వ స్వాగతం దక్కిందని సీనియర్ నేత జైరామ్ రమేష్ సైతం తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment