
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో చైర్మన్ నీరజ్ బజాజ్ ముంబైలో అత్యంత ఖరీదైన మలబార్ హిల్ ప్రాంతంలో, సముద్ర తీరంలోని ఓ పెంట్ హౌస్ (ట్రిప్లెక్స్)ను రూ.252.50 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. గృహాల సెర్చింగ్ పోర్టల్ ఇండెక్స్‌ట్యాప్ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ప్రముఖ రియల్టీ డెవలపర్ లోధా గ్రూపు నుంచి నీరజ్ బజాజ్ ఈ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశారు. మార్చి 13న ఈ లావాదేవీ జరిగింది.
రూ.15.15 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్టు సమాచారం. మలబార్ ప్యాలసెస్ ప్రాజెక్ట్‌లోని 29, 30, 31 అంతస్తులను నీరజ్ బజాజ్ ఇంత భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకున్నారు. 18,008 చదరపు అడుగుల విస్తీర్ణం (కార్పెట్ ఏరియా 12,624 చదరపు అడుగులు) పరిధిలో మూడు అంతస్తులుగా ఉంటుంది. ఎనిమిది కారు పార్కింగ్ స్లాట్లు కూడా ఉన్నాయి. గత నెలలో వెల్‌స్పన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయెంకా రూ.230 కోట్లతో ముంబైలోని వర్లిలో అపార్ట్‌మెంట్ కొనుగోలు చేయడం తెలిసిందే. అలాగే డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ సైతం పలు ప్రాపర్టీలను కొనుగోలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment