లోధా గ్రూప్‌ రియల్టీ ఫండ్‌ | Realty developer Lodha Group launches start-up investment fund | Sakshi
Sakshi News home page

లోధా గ్రూప్‌ రియల్టీ ఫండ్‌

Published Thu, Jan 5 2017 1:07 AM | Last Updated on Tue, Sep 5 2017 12:24 AM

లోధా గ్రూప్‌ రియల్టీ ఫండ్‌

లోధా గ్రూప్‌ రియల్టీ ఫండ్‌

రియల్టీ స్టార్టప్‌ల కోసం రూ.50 కోట్లతో ఏర్పాటు
న్యూఢిల్లీ: రియల్టీ సంస్థ, లోధా గ్రూప్‌..రియల్టీ స్టార్టప్‌ల కోసం ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ను ప్రారంభించింది. రూ.50 కోట్ల మూలధనంతో ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ను ఏర్పాటు చేశామని లోధా గ్రూప్‌ తెలిపింది. స్మార్ట్‌ సిటీ సొల్యూషన్స్‌  అందించే స్టార్టప్‌లకు, రియల్టీ రంగంలోని స్టార్టప్‌లకు తగిన నిధులను అందించడమే కాకుండా, వ్యాపార అవకాశాలను, పరిశ్రమతో అనుసంధానాన్ని, మార్గదర్శకత్వాన్ని అందిస్తామని లోధా గ్రూప్‌ ఎండీ అభిషేక్‌ లోధా చెప్పారు. తమ కంపెనీల విలువలకు, తత్వానికి దగ్గరగా ఉన్న స్టార్టప్‌లకు అన్ని విధాలా తోడ్పాటునందిస్తామని వివరించారు. రియల్టీ రంగంలో ప్రస్తుతమున్న లోటుపాట్లను టెక్నాలజీ, స్మార్ట్‌ సొల్యూషన్లతో తొలగించేలా తమ  ఫండ్‌ ప్రయత్నిస్తుందని తెలిపారు. ఇప్పటికే 2–3 బిజినెస్‌ ఐడియాలను పరిశీలించామని, తొలి దశ పెట్టుబడులు ఈ ఏడాది మార్చికల్లా పూర్తవుతాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement