investment fund
-
ఖరీఫ్‌కు ముందే ‘వైఎస్సార్ రైతు భరోసా’
సాక్షి ప్రతినిధి, గుంటూరు, కొరిటెపాడు: భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రైతులు ఖరీఫ్‌కు సమాయత్తమవుతుండగా ముందుగానే పెట్టుబడి సాయం అందించేందుకు రంగం సిద్ధం చేసింది. 2022–23 ఆర్ధిక సంవత్సరానికి గాను ‘వైఎస్సార్ రైతు భరోసా’ నగదు అందజేసేందుకు వ్యవసాయాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి అర్హులైన అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నారు. గుంటూరు జిల్లాలో 1,12,843 మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం కింద రూ.84.63 కోట్లు జమ కానుంది. పల్నాడు జిల్లాలో 2,43,492 మంది రైతులకుగాను రూ. 182.62 కోట్ల జమ కానున్నాయి. బాపట్ల జిల్లాలో 1,63,692 మంది రైతులకు రూ. 122.76 కోట్ల లబ్ధి కలగనుంది. ముందస్తుగా సాయం... ఖరీఫ్ సాగులో దుక్కులు దున్నేందుకు, విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా ప్రభుత్వం ముందస్తుగా పెట్టుబడి సాయం అందిస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా రూ.13,500 ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అందిస్తోంది. ఇందులో భాగంగా 2022–23 సంవత్సరానికి ఎంపికైన రైతుల బ్యాంకు ఖాతాల్లో తొలి విడతగా సోమవారం పీఎం కిసాన్తో కలిపి రూ.7,500 జమ చేసేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మండల వ్యవసాయాధికారి పర్యవేక్షణలో ఏఈఓలు, సచివాల య అగ్రికల్చర్ అసిస్టెంట్లు గ్రామాల్లో రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకం మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు. ఈ మేరకు అర్హులైన రైతుల జాబితాను స్థానిక రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించారు. అర్హులందరికీ వర్తించేలా... వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ పథకం కింద ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో రూ.13,500 సాయాన్ని అందిస్తోంది. మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, మిగిలిన రూ.2 వేలు జనవరి మాసంలో జమ చేస్తోంది. భూ యజమానులకు మాత్రమే పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో రూ.6 వేలు చొప్పున నిధులు మంజూరు చేస్తోంది. ఎలాంటి భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు, దేవదాయ, అటవీ, వక్ఫ్ తదితర ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న రైతులకు రూ.13,500 చొప్పున వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ధీమాతో సాగుకు సై... వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగ చేసేలా విత్తు మొదలు పంట విక్రయించే వరకు అన్నదాతకు అండగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ భరోసా కల్పిస్తోంది. బ్యాంకులు కూడా విరివిగా రుణాలు ఇస్తుండటంతో రైతులు ధీమాతో సాగుకు సై అంటున్నారు. (చదవండి: ప్రాణాలను సైతం లెక్కచేయని సేవామూర్తులకు శుభాకాంక్షలు: సీఎం జగన్) -
‘సిప్’కి జై కొడుతున్నారు
ముంబై: ఇంతకాలం చిట్టీలలో పొదుపు చేస్తూ, రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెట్టుబడిగా పెట్టిన వారు తమ రూటు మార్చుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి మార్కెట్ వర్గాలు. నెలవారీ చెల్లింపులు చేసే అవకాశం ఉండే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌కు క్రమంగా పెరుగుతున్న ఆధారణ ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. పెరిగిన ఆసక్తి కరోనా సంక్షోభం తర్వాత పొదుపు, పెట్టుబడి విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాదాపుగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించాయి. ఇదే సమయంలో ఇంటర్నెట్ వాడకం కామన్ అయ్యింది. దీంతో టెక్నాలజీని వాడుకుంటూ తమ వద్ద ఉన్న కొద్ది మొత్తాలను స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా మార్చేందుకు రిస్క్ తీసుకుంటున్నారు. అయితే స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్‌లో రిస్క్ ఎక్కువ, అయితే తక్కువ పెట్టుబడితో బ్లూ చిప్ కంపెనీల్లో షేర్ల కొనుగోలు కష్టంగా. దీంతో తక్కువ రిస్క్ కోరుకునే వారు మ్యూచ్‌వల్ ఫండ్స్‌కి మొగ్గు చూపేవారు. అయితే ఆగస్టులో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు తగ్గాయి. కేవలం రూ.8,666 కోట్ల రూపాయలే వచ్చాయి. అంతకు ముందు జులైలో ఈ మొత్తం రూ.22,583 కోట్లుగా నమోదు అయ్యింది. జోరుమీదున్న సిప్ నెలవారీగా చిట్టీలు కట్టినట్టు, ప్రతీ నెల ఈఎంఐలు చెల్లించినట్టు మ్యూచవల్స్ ఫండ్స్‌లో ప్రతీ నెల ఇన్వెస్ట్ చేయడాన్నే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) అంటారు. ఆర్థిక నిపుణుల సలహా మేరకు ఒక సిప్‌ను ఎంచుకుంటే ప్రతీ నెలా కొంత మొత్తం మన అకౌంట్ నుంచి ఆయా కంపెనీలో పెట్టుబడిగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రస్తుతం సిప్‌లో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక్క ఆగస్టులోనే సిప్‌కి సంబంధించిన అసెట్ అండర్ మేనేజ్మెంట్ (ఏఎమ్యూ) విలువ రూ. 5.26 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది మొత్తం సిప్ ఏఎమ్యూ విలువ రూ.17.15 లక్షల కోట్లలో మూడో వంతుగా ఉంది. సిప్‌లపై చెల్లించే వడ్డీ ఆగస్టులో లైఫ్‌టైం హైకి చేరుకుని రూ.9,923 కోట్లుగా నమోదు అయ్యింది. ఆగస్టులోనే ఏకంగా 24.92 లక్షల కొత్త సిప్‌లు మొదలయ్యాయి. మెత్తంగా 4.32 కోట్ల సిప్‌లు ఉన్నాయి. సిప్‌లకు సంబంధించి అత్యధికంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో 53 లక్షల కొత్త ఖాతాలు ప్రారంభమయ్యాయి. రికార్డు స్థాయిలో మ్యూచవల్ ఫండ్స్‌లో పెట్టుబడులు తగ్గినా సిప్‌లో ఖాతాలు పెరగడం వల్ల ఓవరాల్‌గా మ్యూచ్‌వల్ ఫండ్ మార్కెట్ పరిస్థితి మెరుగ్గానే ఉంది. 2021 ఆగస్టు నాటికి మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో పెట్టుబడులు 36.59 లక్షల కోట్లకు చేరుకుని ఆల్‌టైం హైని టచ్ చేశాయి. చదవండి: ఈక్విటీ మార్కెట్ల మద్దతు ఒక్కటే చాలదు -
‘పీఎం–కిసాన్’ లబ్ధిదారుల్ని గుర్తించండి
న్యూఢిల్లీ: పీఎం–కిసాన్ పథకం కింద తొలి విడతలో రూ.2 వేలు పొందే చిన్న, సన్నకారు రైతులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. బడ్జెట్లో ప్రతిపాదించిన ఈ పథకానికి ఇప్పటికే రూ.20 వేల కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా మొత్తం 12 కోట్ల మంది రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారని అంచనా. ఈశాన్య రాష్ట్రాల్లో మినహా ఈ రైతు ప్యాకేజీ అమలులో పెద్దగా ఇబ్బందులేమీ రావని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు. సాగుకు పెట్టుబడి సాయంపై వ్యవసాయ శాఖ చాలా రోజులుగా కసరత్తు చేస్తోందని, అదే ఉత్సాహంతో ఈ పథకాన్ని అమలుచేస్తామని తెలిపారు. రూపకల్పన కన్నా అమలుపరచడమే ఇందులో ప్రధానమని, చిన్న, సన్నకారు రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధను తాజా బడ్జెట్ ప్రతిబింబిస్తోందని అన్నారు. లబ్ధిదారుల్ని గుర్తించే ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శులు, వ్యవసాయ కార్యదర్శులకు ఈ నెల 1న లేఖలు పంపారని వెల్లడించారు. లబ్ధిదారుల పేరు, కులం తదితర వివరాల్ని సేకరించి స్థానిక గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులో ఉంచాలని లేఖలో సూచించారు. చాలా రాష్ట్రాల్లో భూ దస్త్రాల డిజిటలీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఫిబ్రవరి ఒకటి నాటికి భూ రికార్డుల్లో పేర్లు నమోదైన యజమానులే పీఎం–కిసాన్ పథకానికి అర్హులని రాజీవ్ కుమార్ తెలిపారు. ఏడాదికి రూ.6 వేలు అంటే చిన్న మొత్తమేమీ కాదని, ఆ డబ్బుతో పేద రైతులు ఎన్నో ఖర్చులు వెళ్లదీసుకోవచ్చని అన్నారు. చిక్కులు తప్పవు: నిపుణులు పథకం అమలులో న్యాయపర చిక్కులు తప్పవని వ్యవసాయ నిపుణుల విశ్లేషణ. యాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ పథకానికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయని సీనియర్ న్యాయవాది ఎన్కే పొద్దార్ పేర్కొన్నారు. ఒకే సాగు భూమికి ఒకరి కన్నా ఎక్కువ మంది యజమానులు ఉండి, వారందరికీ రూ.6 వేల చొప్పున సాయం అందితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ పథకం కింద వెచ్చించే కోట్లాది రూపాయలు అనుత్పాదక వినియోగంలోకి వెళ్తాయని ఆర్థిక నిపుణుడు శశికాంత్ సిన్హా అన్నారు. -
కాంగ్రెస్ నేతలు పరిగలు ఏరుకోవాల్సిందే
సాక్షి, సిద్దిపేట: ‘సీఎం కేసీఆర్ స్వయానా రైతు బిడ్డ. అందుకోసమే రైతును రాజుగా చూడాలని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వం వర్షాకాలానికి ముందుగా ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి సహాయం అందిస్తోంది. దీంతో రైతులు ఎరువులు, విత్తనాల కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసే దుస్థితి తప్పింది. ఇంత మంచి పని చేసిన కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు సమర్థి స్తున్నారు. ప్రతిచోట బ్రహ్మరథం పడుతున్నారు. ఇక కాంగ్రెస్ నాయకులు వచ్చే ఎన్నికల్లో పరిగలు ఏరుకోవడం మినహా.. చేసేది ఏమీ లేదు’అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం సిద్దిపేట నియోజకవర్గం రంగధాంపల్లి, గజ్వేల్ నియోజకవర్గం బూరుగుపల్లిలో రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు పథకంతో ప్రజలు గ్రామగ్రామాన పండగ జరుపుకుంటున్నారని, సాగుకు ముందే సహాయం అందడంతో రైతు లు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభు త్వం మద్దతు ధర, నిరంతర విద్యుత్, పెట్టుబడి సహాయం అందించడంతో పాటు సాగునీరిచ్చేందుకు కష్టపడుతోందని చెప్పారు. -
లోధా గ్రూప్ రియల్టీ ఫండ్
రియల్టీ స్టార్టప్‌ల కోసం రూ.50 కోట్లతో ఏర్పాటు న్యూఢిల్లీ: రియల్టీ సంస్థ, లోధా గ్రూప్..రియల్టీ స్టార్టప్‌ల కోసం ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌ను ప్రారంభించింది. రూ.50 కోట్ల మూలధనంతో ఈ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేశామని లోధా గ్రూప్ తెలిపింది. స్మార్ట్ సిటీ సొల్యూషన్స్ అందించే స్టార్టప్‌లకు, రియల్టీ రంగంలోని స్టార్టప్‌లకు తగిన నిధులను అందించడమే కాకుండా, వ్యాపార అవకాశాలను, పరిశ్రమతో అనుసంధానాన్ని, మార్గదర్శకత్వాన్ని అందిస్తామని లోధా గ్రూప్ ఎండీ అభిషేక్ లోధా చెప్పారు. తమ కంపెనీల విలువలకు, తత్వానికి దగ్గరగా ఉన్న స్టార్టప్‌లకు అన్ని విధాలా తోడ్పాటునందిస్తామని వివరించారు. రియల్టీ రంగంలో ప్రస్తుతమున్న లోటుపాట్లను టెక్నాలజీ, స్మార్ట్ సొల్యూషన్లతో తొలగించేలా తమ ఫండ్ ప్రయత్నిస్తుందని తెలిపారు. ఇప్పటికే 2–3 బిజినెస్ ఐడియాలను పరిశీలించామని, తొలి దశ పెట్టుబడులు ఈ ఏడాది మార్చికల్లా పూర్తవుతాయని పేర్కొన్నారు.