సాక్షి, న్యూఢిల్లీ: టెక్నాలజీ రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్స్‌కు సంబంధించిన ప్రాజెక్ట్ పై హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(ఎన్‌హెచ్‌ఆర్‌ఎస్‌సీఎల్) గురువారం అగ్రిమెంట్ కుదుర్చుకుంది. 24 వేలకోట్లతో ప్రారంభించే అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఎల్ అండ్ టీ కంపెనీ ఈ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. మెదటగా ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య ఆరు రైళ్లను నడపనున్నారు. గుజరాత్‌లో ఎన్‌హెచ్‌ఆర్‌ఎస్‌సీఎల్ 325 కి.మీ. సంబంధించిన భూమి, ప్రాజెక్ట్ వివరాలను ఎల్ అండ్ టీ కి అప్పజెప్పింది. అయితే గుజరాత్ వైపు ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత మహారాష్ష్ర్ట ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు భూమిని సమకూర్చాల్సి ఉంటుంది.
ఈ ప్రాజెక్ట్ కేవలం జపాన్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా..అన్ని ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడుతుందని జపాన్ అంబాసిటర్ సంతోష్ సుజుకీ అభిప్రాయపడ్డారు. రైల్వే బోర్డు సీఈఓ, చైర్మన్ వి.కే యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత మరో ఏడు మార్గాలలో ఇలాంటి ప్రాజెక్ట్ ప్రారంభిస్తాం అన్నారు. ఇలాంటి ప్రాజెక్ట్‌ల వల్ల టెక్నాలజీని అందిపుచ్చుకోవడమే కాకుండా ఉద్యోగ కల్పన జరుగుతుంది అన్నారు. ఇంజనీర్స్, టెక్నీషియనన్స్, డిజైనర్ లాంటి స్కిల్ కలిగిన వారికి మాత్రమే కాక, నిర్మాణ కార్మికులకు, సెమీ స్కిల్ వర్కరర్స్‌కు పని దొరుకుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment