![ISRO Shares First Pictures Of Earth Captured By Chandrayaan 2 - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/4/earth.jpg.webp?itok=CLeGHKSK)
సాక్షి, న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుంచి ఈ నెల 22వ తేదీన ప్రయోగించిన చంద్రయాన్ -2 మిషన్ ప్రయోగించిన విషయం తెలిసిందే. శుక్ర వారం మధ్యాహ్నం 3.27 గంటలకు ఆర్బిట ర్‌లోని ఇంధనాన్ని 646 సెకండ్ల పాటు మండించి నాలుగోసారి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంచారు. చంద్రయాన్–2 మిషన్ రోదసీలో ఆరోగ్యకరంగా ప్రయాణి స్తోందని ఇస్రో శాస్త్ర వేత్తలు అధికారికంగా వెల్లడించారు.
తాజాగా శుక్రవారం నాలుగోసారి భూమికి దగ్గరగా ఉన్న 270 కిలోమీటర్ల దూరాన్ని.. 277 కిలోమీటర్లకు, భూమికి దూరంగా ఉన్న 71,792 కిలోమీటర్ల దూరాన్ని 89,472 కిలోమీటర్ల దూరానికి విజయవంతంగా పెంచారు. మళ్లీ ఈ నెల 6న ఐదోసారి కక్ష్యదూరం పెంచే ఆపరేషన్‌ను చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారు. తర్వాత ఈ నెల14న చివరిగా చంద్రయాన్–2 మిషన్‌ను భూ మధ్యంతర కక్ష్య నుంచి ఒకేసారి చంద్రుడి కక్ష్యలోకి పంపే ప్రక్రియను కూడా చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రయాన్-2లోని ఎల్ఐ4 కెమెరా తీసిన భూగ్రహం ఫొటోలను ఇస్రో ఈరోజు విడుదల చేసింది. నీలిరంగులో భూమి మెరిసిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment