
సాక్షి, తాడేపల్లి: టెస్ట్ వెహికల్ ఫ్లైట్ టీవీ-డీ1 సక్సెస్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో బృందానికి సీఎం అభినందనలు తెలిపారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో మరింత ఎత్తైన కక్ష్యలోకి ఇస్రో దూసుకెళ్లోందంటూ సీఎం జగన్ కొనియాడారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్‌యాన్ మిషన్‌లో తొలి అడుగు పడింది. ఇస్రో తొలి పరీక్ష ‘టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్’(టీవీ-డీ1) ప్రయోగం విజయవంతమైంది. శనివారం ఉదయం శ్రీహరికోట నుంచి నింగిలోకి రాకెట్ దూసుకెళ్లగా.. క్రూ మాడ్యూల్ పారాచూట్‌ల సాయంతో కిందకు సురక్షితంగా ల్యాండ్(సముద్రంలోకి) అయ్యింది. గగన్‌యాన్‌లో వ్యోమగాముల భద్రతకు సంబంధించి కీలకమైన ఈ సన్నాహాక ప్రయోగం సక్సెస్ కావడం పట్ల.. ఇస్రో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు.
చదవండి: ఇస్రో ‘గగన్‌యాన్’ TV-D1 ప్రయోగం సక్సెస్
Comments
Please login to add a commentAdd a comment