బెంగళూరు: చంద్రయాన్-3 నుంచి ఇస్రో మరో అప్‌డేట్ ఇచ్చింది. విక్రమ్ ల్యాండర్ మరోసారి చంద్రుడి ఉపరితలం మీద సాఫ్ట్ ల్యాండ్ అయినట్లు తెలిపింది.
నిర్ణీత ప్రాంతం నుంచి సుమారు 30-40 సెం.మీ. దూరంలో జంప్ చేసింది విక్రమ్. ల్యాండింగ్ సమయంలో దుమ్ము, ధూళి పైకి లేచాయి. అయితే ఇది ఏ సమయంలో చేశారన్నదానిపై ఇస్రో స్పష్టత ఇవ్వలేదు.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) September 4, 2023
🇮🇳Vikram soft-landed on 🌖, again!
Vikram Lander exceeded its mission objectives. It successfully underwent a hop experiment.
On command, it fired the engines, elevated itself by about 40 cm as expected and landed safely at a distance of 30 – 40 cm away.… pic.twitter.com/T63t3MVUvI
ఇప్పటికే స్లీపింగ్‌మోడల్‌లోకి వెళ్లింది ప్రగ్యాన్ (ప్రజ్ఞాన్ రోవర్). ఇక ఇప్పుడు ల్యాండర్ విక్రమ్‌ను సైతం స్లీప్‌మోడ్‌లోకి తీసుకెళ్లింది ఇస్రో. చంద్రుడిపై సూర్యోదయం దాకా ఇస్రో ఎదురు చూస్తుంది. ఈ రెండూ సెప్టెంబర్ 22వ తేదీన తిరిగి యాక్టివ్ మోడ్‌లోకి వస్తాయి. ఆ మరుసటి రోజు పంపే డేటాపై ఇస్రో ప్రకటన చేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment