
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ షార్ నుంచి ఈనెల 14న ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్‌కు ఈనెల 25న అయిదోసారి కక్ష్య దూరాన్ని పెంచనున్నారు. బెంగళూరులోని ఇ్రస్టాక్ కేంద్రం శాస్త్రవేత్తలు 25న మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్యలో ఈ ఆపరేషన్ చేపట్టనున్నారు.
భూమికి సంబంధించిన కక్ష్యలో ఆఖరిసారిగా చేపట్టే ఆపరేషన్‌తో చంద్రయాన్–3 భూమి నుంచి విశ్వంలో చంద్రుడ్ని చేరుకునే దిశగా ప్రయాణిస్తుంది. ఆగస్ట్ 1 నాటికి చంద్రయాన్–3 లూనార్ ఆర్బిట్ (చంద్ర కక్ష్య)కు చేరుకుంటుంది. అక్క డ నుంచి 17 రోజుల పాటు చంద్రుడి చుట్టూ పరి్రభమిస్తూ ఆగస్ట్ 23న చంద్రునికి 30 కిలోమీటర్ల ఎత్తులో ప్రపొల్షన్ మాడ్యూల్ ల్యాండర్‌ను విడిచి పెడుతుంది. అదే రోజు సాయంత్రం ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ప్రాంతంలో చంద్రుడి ఉపరితలంపై దిగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment