సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత నెల 14న ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్ ప్రస్తుతం లూనార్ ఆర్బిట్ (చంద్రుడి కక్ష్య)లో చంద్రుడికి దగ్గరగా 170 కిలోమీటర్లు, దూరంగా 4,313 కి.మీ. దీర్ఘ వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానంతో ఏకంగా చంద్రుడ్ని అత్యంత దగ్గరగా వీడియో తీసి భూ నియంత్రిత కేంద్రానికి పంపింది.
ఆదివారం రాత్రి చంద్రునిపై మొదటి అర్బిట్ రైజింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఆర్బిట్ రైజింగ్ చేసే క్రమంలో చంద్రయాన్–3 మిషన్ చంద్రుడి చుట్టూ తిరుగుతూ ప్రొపల్షన్ మాడ్యూల్‌లో అమర్చిన కెమెరాలు చంద్రుడికి దగ్గరగా వెళ్లినపుడు 45 సెకండ్లపాటు తీసిన వీడియోను ఇస్రో సోమవారం విడుదల చేసింది. లూనార్ ఆర్బిట్‌లో కక్ష్య దూరాన్ని తగ్గిస్తూ 23వ తేదీ నాటికి చంద్రుడికి 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి చంద్రుడి చెంతకు తీసుకొస్తారు.
Comments
Please login to add a commentAdd a comment