
పీఎస్‌ఎల్‌వీ సీ27 కౌంట్‌డౌన్ ప్రారంభం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ (షార్) నుంచి శనివారం ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ సీ27కు గురువారం...
- రేపు సాయంత్రం ప్రయోగం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ (షార్) నుంచి శనివారం ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ సీ27కు గురువారం ఉద యం లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ డాక్టర్ ఎం.వై.ఎస్.ప్రసాద్ ఆధ్వర్యంలో 5.49 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించారు. కౌంట్‌డౌన్ సమయం లో గురువారం ఉదయం నాలుగోదశలో ద్రవ ఇంధనం (మోనో మిథైల్ హైడ్రోజన్), సాయంత్రం మిక్స్‌డ్ ఆక్సైడ్ నైట్రోజన్ ఇంధనం నింపారు.
గురువారం రాత్రంతా రాకెట్‌కు అవసరమైన వ్యవస్థలను అప్రమత్తం చేశారు. శుక్రవారం ఉదయం రెండోదశలో ద్రవ ఇంధనాన్ని నింపుతారు. కౌంట్‌డౌన్ 59.30 గంటలు కొనసాగిన అనంతరం శనివారం సాయంత్రం 5.19 గంటలకు ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రయోగంలో 1,425 కిలోల బరువున్న ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం సిరీస్‌లో నాలుగో ఉపగ్రహమైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డీని అంతరిక్షంలోకి పంపనున్నారు.
ఇది పదేళ్ల పాటు సేవలం దిస్తుంది. ఈ ప్రయోగానికి రాకెట్, ఉపగ్రహంతో కలిపి సుమారు రూ.1,400 కోట్లు వ్యయం చేస్తున్నట్టు తెలి సింది. ఈ ప్రయోగాన్ని వీక్షిం చేందుకు వీఐపీలు ఎవరూ రావడం లేదని సమాచారం. ఇస్రో చైర్మన్ ఎ.ఎస్.కిరణ్‌కుమార్ గురువారం రాత్రికి షార్‌కు చేరుకోనున్నారు.