క్రూ మాడ్యూల్‌కు లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను జతచేసిన ఇస్రో
సూళ్లూరుపేట: భవిష్యత్తులో మానవ సహి త అంతరిక్ష ప్రయోగాలకు సన్నాహక ప్రా జెక్టుగా పేరొందిన గగన్‌యాన్–1 మిషన్‌లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అడుగు ముందుకేసింది. సంక్షిష్టమైన లిక్విడ్ ప్రొపెల్షన్ సిస్టమ్‌ను క్రూ మాడ్యూ ల్‌తో విజయవంతంగా అను సంధానించింది. అనుసంధానం తర్వాత ఈ మాడ్యూల్‌ను మంగళవారం శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ స్పేస్‌సెంటర్‌కు తరలించినట్లు బెంగళూరులో ఇస్రో వారి లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ బుధవారం ప్రకటించింది.
మానవసహిత అంతరిక్ష ప్రయోగాల్లో తమ సామర్థ్యాలను నిరూపించుకునేందుకు ఇస్రో తొలిసారిగా గగన్‌యాన్ పేరిట ఒక మానవరహిత ప్రయోగాన్ని చేపడుతున్న విషయం తెల్సిందే. ఈ మానవరహిత ప్రయోగం కోసమే తొలిసారిగా ఈ క్రూ మాడ్యూల్‌ను సిద్ధంచేస్తున్నారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ) లో రూపొందించిన క్రూ మాడ్యూల్ అప్‌రైటింగ్ సిస్టంను మహేంద్రగిరిలోని లిక్విడ్ ప్రపొల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్‌పీఎస్‌సీ)లో ప్రొపల్షన్ సిస్టంతో అను సంధానించారు.
క్రూ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టం అనేది ఒక రియాక్షన్ కంట్రోల్ సిస్టం(ఆర్‌సీఎస్). అంటే క్రూ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లి స్వేచ్ఛగా వదిలేశాక భూమి దిశగా దిగొచ్చేటప్పుడు దాని వేగాన్ని నియంత్రించి పారాచూట్‌ల సాయంతో నెమ్మదిగా సముద్రం మీదకు దిగేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞా నాన్ని ఇందులో ఇమ డ్చారు. కిందకు పడేటప్పుడు సూటిగా వచ్చేలా, అటు ఇటూ తిరక్కుండా, పల్టీలు కొట్టకుండా మూడురకాలుగా దాని భద్రతను చూడ టమే ఆర్‌సీఎస్ పని. వ్యోమనౌక నుంచి విడిపోయి అంతరిక్షంలోకి చేరుకునే టప్పు డు, తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు పారాచూట్‌లు విచ్చుకోకముందు ఆర్‌సీఎస్‌ను వాడతారు.
Comments
Please login to add a commentAdd a comment