మూడు భూమిలాంటి గ్రహాలు
పారిస్: భూమి వంటి జీవం ఉన్న మూడు గ్రహాలను కనుగొన్నట్లు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. మన సౌర వ్యవస్థకు ఆవల ఉన్న ఇవి ఆవాసయోగ్యంగా ఉన్నాయంది. 39 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహాలు పరిమాణంలో, ఉష్ణోగ్రతలో భూమి, శుక్ర గ్రహాలతో సమానంగా ఉన్నట్లు పేర్కొంది.
సౌర వ్యవస్థకు బయట జీవానికి సంబంధించిన రసాయన ఆనవాళ్లను కనుగొనేందుకు ఇది తొలి అవకాశమని బెల్జియంలోని లీగె వర్సిటీకి చెందిన వ్యోమభౌతిక శాస్తవేత్త మైకేల్ గిల్లాన్ చెప్పారు. భూగ్రహానికి సమీపంలో ఉన్నందున అక్కడి వాతావరణాన్ని ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ సాయంతోనే పరిశీలించే అవకాశముందన్నారు.